Home బిజినెస్ జిఎస్‌టిలోకి 90 శాతం ట్రేడర్లు

జిఎస్‌టిలోకి 90 శాతం ట్రేడర్లు

 తెలంగాణ రాష్ట్రంలో పురోగతి
 సిఎం కెసిఆర్ అభినందన 

GSTహైదరాబాద్ : ఈ నెల 1 నుం చి అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని అమలు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రం అద్బు త ప్రగతి సాధించిందని కేంద్ర ప్రభుత్వ అధికారులు కితాబునిచ్చారు. మొదటి పక్షం రోజుల్లోనే 90 శాతం మంది వాట్ ఖాతాదారుల ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకు పోగల్గినట్లు పేర్కొ న్నారు. తెలంగాణ వ్యాప్తంగా వ్యాట్ పరిధిలో ఉన్న 2.16 లక్షల మంది ట్రేడర్లలో 1.92 లక్షల మంది ట్రేడర్లు ఈ నెల 15 వరకు జిఎస్‌టిలో అ నుసంధానమై నంబర్లు పొందినట్లు తెలిపారు. 15 రోజుల్లో ఇంతటి పురోగతి సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని వారు తెలిపారు.
సిఎం అభినందన అవగాహన క ల్పించి వ్యాట్ ఖాతాదారులను గరిష్ట సంఖ్యలో జిఎస్‌టిలో రిజిస్టర్ చేయించడంలో విశేష కృషి చేసిన అధికా రులను ముఖ్యమంత్రి కెసిఆర్ అభి నందించారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించారని వాణిజ్యపన్నులశాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్‌తో పాటు ఇతర అధి కారులను సిఎం అభినందించారు. ఈ నెలాఖరు లోగా వంద శాతం రిజిష్ట్రేషన్ పూర్తి కావాలని చెప్పారు. గ్రానైట్, బీడీ, వస్త్ర పరిశ్రమకు రాయి తీలు కోరామని, కేంద్రమే ఈ విషయంలో సాను కూలంగా స్పందించాల్సి ఉందన్నారు. జిఎస్‌టి కౌన్సిల్‌లో ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిందని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. ఈ రంగాలపై ఆధార పడే వారు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారని, జిఎస్‌టి వల్ల వీరికి ప్రతి కూలత ఎదురవుతుందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.
పన్నులపై ప్రజలకు వివరించండి
జిఎస్‌టిలోని సానుకూల అంశాలను ప్రజలకు విడమరిచి చెప్పాలని అధికా రులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. రూ.20 లక్షల లోపు వ్యాపారం చేసుకు నే వారికి ఎలాంటి పన్నులు పడవని, రూ. 75 లక్షల లోపు వ్యాపారం చేసుకు నే వ్యాపారుల కు కూడా కేవలం ఒక శాతమే పన్ను విధిస్తు న్నారని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. జిఎస్‌టి ద్వారా చెల్లించే పన్నుల్లో సగం రాష్ట్ర ఖజానాకే వస్తుందని, దీని వల్ల రాష్ట్రానికి మేలే తప్ప నష్టం జరగదన్నారు. ప్రజల్లో అనస వర ఆందోళన పోగొట్టి వాస్తవాలను చెప్పాలని సిఎం సూచిం చారు.
ఎక్సైజ్, కమర్సియల్ టాక్స్ ముఖ్య కార్య దర్శి సోమేష్ కుమార్ నాయకత్వంలో అధి కార యంత్రాంగం రంగంలోకి దిగాలని కోరారు. సిఎంఒ అదనపు ముఖ్య కార్యదర్శి శాంత కుమారి జిఎస్‌టి వ్యూహాలను అమలు చేసే బాధ్యతలను తీసుకున్నారు.