Home తాజా వార్తలు 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం…

90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం…

Oscar

అమెరికా: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది.  లాస్ ఏంజిల్స్‌లోని  డాల్బీ థియేటర్‌లో సోమవారం ఉదయం 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ అవార్డులలో అన్ని కేటగిరీల్లో విజేతల వివరాలను ప్రకటించారు. ఈ వేడుకకి ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆస్కార్ అవార్డులను జీవితంలో ఒక్కసారైన అందుకోవాలని ప్రతి కళాకారుడి ఆకాంక్ష ఉంటుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్‌ తారలతో పాటు వివిధ దేశాలకు చెందిన సినీ స్టార్‌ ఇక్కడికి చేరుకుని హంగామా సృష్టించారు.

Oscar2

 

2018 ఆస్కార్ విజేత‌లు…

ఉత్తమ నటుడు – గ్యారీ ఓల్డ్ మ్యాన్ ( డార్కెస్ట్ హవర్)

ఉత్తమ నటి – ఫ్రాన్సెస్ మెక్ డార్మాండ్ ( థ్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి )

ఉత్తమ చిత్రం – ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌

ఉత్తమ డైరెక్టర్ – గుల్లెర్మో డెల్ టోరో (ది షేప్ ఆఫ్ వాటర్ )

ఉత్తమ సహాయ నటుడు- సామ్‌రాక్ వెల్ (త్రీ బిల్‌బోర్డ్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్)

ఉత్తమ సహాయ నటి- ఆలీసన్ జానీ

ఉత్తమ వస్త్రాలంకరణ- మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ త్రెడ్)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్- ఐకారస్

ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ- డార్కెస్ట్ హవర్

ఉత్తమ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రం – ఏ ఫెంటాస్టిక్ ఉమెన్

ఉత్తమ సౌండింగ్ ఎడిటింగ్-డన్‌కిర్క్

ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – డన్ కిర్క్

ఉత్తమ సినిమాటోగ్రఫీ- బ్లేడ్ రన్నర్

ఉత్తమ లఘుచిత్రం (యానిమేటెడ్) - డియర్ బాస్కెట్‌బాల్

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే - జేమ్స్ ఐవరీ (కాల్ మి బై యువర్ నేమ్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్-   ది షేప్ ఆఫ్ వాబర్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- కోకో

ఉత్తమ యానిమేటెడ్ షాట్- డియర్ బాస్కెట్ బాల్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్-  రోజర్ ఎ. డీకిన్స్  (బ్లేడ్ రన్నర్ 2049)

ఉత్తమ డాక్యుమెంటరీ షాట్- హెవెన్ ఈజ్ ఏ ట్రాఫిక్ ఆన్ ది 405

ఉత్తమ లైవ్ యాక్షన్ షాట్- ది సైలెంట్ చైల్డ్

ఉత్తమ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే-  జోర్డాన్ పీలే (గేట్ ఔట్)

Oscar3