Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

92 సంవత్సరాల వయసులో చదువుకోవాలనే కోరిక

96-years-old-women

హైదరాబాద్: గువడలూపె పాలాసియోస్‌..ఇది మెక్సికో దేశానికి చెందిన ఓ పాఠశాల విద్యార్థిని పేరు. తెల్ల వెంట్రుకలు, ముడతల చర్మం, వంగిపోయిన నడుము..ఆమె పేరు చెప్పగానే అక్కడి మిగతా విద్యార్థుల ముందు కదలాడే రూపం. విద్యార్థిని అంటున్నారు చెప్తున్న పోలికలేమో ముసలి వ్యక్తికి సంబంధించినవిలా ఉన్నాయి అనిపిస్తుంది కదా. అయితే మీరే  చదివేయండి మరి.

            వివరాలలోకి వెళితే… మెక్సికోకు చెందిన పాలాజియోస్‌కు చదువంటే ప్రేమ. కానీ ఆ ఇంట్లో అందరు కష్టపడితేనే పూట గడుస్తుంది. దాంతో తల్లిదండ్రులతో కలిసి తనూ పనికి వెళ్లేది. పెళ్లైన తరవాత భర్తకు చేదోడువాదోడుగా ఉండటానికి చికెన్‌ మార్కెట్‌లో పనిచేసింది. అయితే ఎన్నడూ అక్షరం ముక్క నేర్చుకోకపోయినా చేతి మీద లెక్కలు కట్టడంలో మాత్రం దిట్ట పాలాసియోస్‌. అన్ని బాధ్యతలు తీరాక 92 సంవత్సరాల వయసులో చదువుకోవాలనే కోరిక పుట్టింది. దానికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వయోజనుల అక్షరాస్యత కార్యక్రమంలో చేరింది.

       చిన్నారులతో పోటీపడి చదివే ఈ బామ్మ నాలుగు సంవత్సరాల్లోనే ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తిచేసింది. అయితే ఆ తరవాత చదవాలనుకుంటే ఎలాంటి ప్రభుత్వ పథకాలు లేకపోవడంతో ఉన్నత విద్యను మాత్రం రెగ్యులర్‌ విద్యార్థులతోనే చదవాలని, అది కూడా 100వ పుట్టిన రోజుకంతా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సోమవారం నాడే ఆమె కొత్తగా ఉన్నత పాఠశాలలో చేరింది. మిగతా పిల్లలంతా ‘దోనా లుపితా’ అని ఆప్యాయంగా పిలుస్తూ తరగతి గదిలోకి ఆహ్వానించారు.  ఈ వయసులో ఇంత ఉత్సాహంగా చదువుకొంటున్న బామ్మ కోరిక తీరాలని మనమూ కోరుకుందాం.

Comments

comments