Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

9200 పంచాయితీ కార్యదర్శి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

9200 panchayat secretary posts green signal in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి గ్రామానికి  ఒక పంచాయతీ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా 9,200 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. వారం రోజుల్లోగా ఈ నియామక ప్రకియ ప్రారంభించి, రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా నియామకమయ్యే 9,200 పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత పని తీరు ఆధారంగా వారిని క్రమబద్దీకరించాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15వేలు జీతం ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో ప్రస్తుతం 3,562 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులున్నారు. అందులో భాగంగా కొత్తగా 9,200 మందిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని చెప్పారు.

 

Comments

comments