Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

తొలి నోటిఫికేషన్

65 thousand Post Vacancy In Telangana

9355 జూ. కార్యదర్శుల కొలువులకు 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ

9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు
సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
10వ తేదీలోపు పరీక్ష రుసుము చెల్లింపు

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్త జోనల్ విధానం అమలులోనికి వచ్చిన తొలి రోజునే పంచాయతీ రాజ్ విభాగంలో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోద తెలపడం, దానికి అనుగుణంగా ప్రభుత్వం త్తర్వులు జారీ చేయడం, వెంటవెంటనే జరిగిపోయాయి. దీని కొనసాగింపుగా తొలినోటిఫికేషన్‌గా 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణ, ఉపాధి శాఖ కమిషనర్ గురువారం జారీ చేశారు. ఈ పోస్టులకు సెప్టెంబర్ 3 నుంచి 11వ తేదీలోపు ‘tspsri.cgg.gov.in.’ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. పరీక్ష రుసమును చెల్లించేందుకు సెప్టెంబర్ 10వ తేదీలోపు చివరి తేదీ. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో 18 నుంచి 39 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు (ఎస్‌సి,ఎస్‌టి, బిసిలకు 5 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు) అర్హులు. సాధారణ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.500లు చెల్లించాల్సి ఉండగా, ఎస్‌సి,ఎస్‌టి,బిసి అభ్యర్థులు దరఖాస్తు రుసుమును రూ.250ల చెల్లించాల్సి ఉంటుంది. 150 మార్కుల చొప్పున రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. మొదటి పేపర్‌లో జనరల్ నాలెడ్జి, జనరల్ ఎబిలిటీ, రెండో పేపర్‌లో కొత్త పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీరాజ్ సంస్థలు, గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలన, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి. రిజర్వేషన్లు, మరిన్ని వివరాలకు ‘tspsri.cgg.gov.in.’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

comments