Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం : 9మంది మృతి

9People were killed in Fire Accident at Hospital

న్యూతైపి : తైవాన్‌లోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9మంది చనిపోయారు. 16మంది గాయపడ్డారు. న్యూతైపి పట్టణంలో ఉన్న ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఆస్పత్రి సిబ్బందితో పాటు రోగులు ఉన్నారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏమిటో తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

9People were killed in Fire Accident at Hospital

Comments

comments