Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పవన్‌ను దాటేసిన నితిన్

Pawan-and-Nitinటాలీవుడ్: తెలుగు చిత్రసీమాలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా చెప్పుకునే నితిన్ ఓ విషయంలో మాత్రం వపన్‌నే దాటేశాడు. అదేనండీ తాజాగా విడుదలైన నితిన్ మూవీ అ..ఆ… ఓవర్సీస్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఏకంగా 1.9 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం విశేషం. దీంతో పవన్ బ్లాక్‌బస్టర్ మూవీ అత్తారింటికి దారేది ఓవర్సీస్‌లో సాధించిన 1.89 రికార్డును 8 రోజులలోనే అ..ఆ.. బ్రేక్ చేసింది. ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రాలలో బాహుబలి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో మొదటి మూడు స్థానాలలో ఉండగా అత్తారింటికి దారేది చిత్రాన్ని అ..ఆ… వెనక్కి నెట్టి నాల్గో స్థానంలో నిలిచింది.

Comments

comments