Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఘట్‌కేసర్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం

A Baby Kindped In Near Ghatkesar Police Stations

ఘట్‌కేసర్ : చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్న గ్యాంగ్ ఘట్‌కేసర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారిని ఎత్తుకెళ్లింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రి సమీపంలో నివాసముంటున్న పంది సురేష్ – మానసలకు చెందిన నిహరికను ఆరుబయట ఆడుకుంటుంటే, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినారు. గుర్తు తెలియన యువతి చిన్నారికి చాక్‌లెట్ ఇస్తానని చెప్పి, నమ్మించి తన వెంట తీసుకువెళ్లింది. రైల్వే స్టేషన్ వరకు వెళ్లగానే అక్కడ పాపకు సంబంధించిన బంధువులు, రైల్వేస్టేషన్‌లో ఉద్యోగం చేస్తాడు, పాపను గుర్తుపట్టి ఇక్కడకి ఎందుకు వచ్చావని నిహరికను అడగగా, ఈ అక్క తీసుకువచ్చిందని తెలిపింది. వెంటనే ఆ యువతి చిన్నారిని కిందకు దించి అక్కడ నుండి పారి పోయింది. నిహరిక కనిపించక పోవడంతో మానస ఇరుగుపోరుగు వారి ఇంట్లో వెతికింది. చివరకు ఎక్కడ కనిపించక పోవడంతో రోదించి సోమ్మసిల్లి పడిపోయింది. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే సంఘటన స్థలానికి చెరుకున్న పోలీసులు, పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన గ్యాంగ్ కోసం గాలింపులు చెపట్టినట్లు సి.ఐ రఘువీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేసినట్లు తెలిపారు.

Comments

comments