Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

పద్ధతి మార్చుకోరా?

image

జిల్లా ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డ కలెక్టర్

మనతెలంగాణ/జగిత్యాల: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని పలుమార్లు సూచించినా మీ పద్ధతి ఎందుకు మారడం లేదంటూ జిల్లా కలెక్టర్ శరత్ ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. శుక్రవారం జిల్లా ప్రధా న ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రి మొ త్తం కలియ తిరిగిన కలెక్టర్ ఎక్స్‌రే తీసే గదిని పరిశీలించా రు.ఒకే గదిలో ఎక్స్‌రే, ఇసిజి తీయడాన్ని చూసిన కలెక్టర్ ఇదేం పద్దతి అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్‌రేను వినియోగించకుండా మాన్యువల్ ఎక్స్‌రేను ఎం దుకు వాడుతున్నారంటూ రేడియాలజిస్ట్ సురేందర్‌ను ప్ర శ్నించారు.అలాగే వివిధ పరీక్షలు చేసేందుకు ఆస్పత్రిలో అవసరమైన గదులుండగా ఒకే గదిలో వివిధ రకాల సేవ లు అందిస్తూ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నారని నిలదీశారు. పలుమార్లు పద్దతి మార్చుకోవాలనిసూచించినా రేడియోగ్రాఫర్ రమేశ్ పనితీరులో మా ర్పు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కలెక్టర్ వెంటనే రమేశ్‌ను సస్పెండ్ చేయాలని అక్కడికక్కడే జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుగంధిని ఆదేశించారు. ఆస్పత్రికి మంజూరైన డయాలసిస్ యూనిట్ ఏర్పాటు పనులను పరిశీలించి సా ధ్యమైనంత తొందరగా పూర్తి చేసి డయాలసిస్ సేవలను అ ందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఈ నెల 25లోపు డ యాలసిస్ యూనిట్‌ను ప్రారంభించాలని లక్షంగా పెట్టుకున్నామని,అయితే పనుల్లో పురోగతి లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్ ఆగ్రహాం వ్యక్తం చేస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అమ్మలాలన సహాయక కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అ క్కడ ఉన్న గర్భిణీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకోవడంతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వార్డులనుకలియతిరిగిన కలెక్టర్ వైద్య సేవలు సరిగా అం దుతున్నాయా..ఎవరైనా సిబ్బంది డబ్బులు అడుగుతున్నా రా అడిగి తెలుసుకున్నారు.ఎవరికి నయా పైసా ఇవ్వవద్దని, డబ్బులు అడిగినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వార్డుకు నామ ఫలకాలు ఏర్పాటు చే యాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సదామోహన్ కు సూచించారు.ఆస్పత్రి ప్రధాన ద్వారం ముందు మూసి ఉన్న గేట్‌ను వెంటనే తెరిపించాలని ఆదేశించారు.అనంతరం కలెక్టర్ వి లేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం కెసిఆర్ కిట్ పథకం అమలు చేయడం వల్ల జగిత్యాల ఆస్పత్రిలో నెలలో 350నుంచి 400ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా కెసిఆర్ కిట్ అమలుతో 75 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా ఏర్పడక ముందు కంటే జిల్లా ఏర్పడిన తర్వాత ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని, వైద్యులు, సిబ్బంది పనితీరులో చాల వరకు మార్పు వచ్చిందన్నారు. సాధారణ ప్రసవాలు చేయించుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని,సాధారణ ప్రసవాలతో తల్లి, బిడ్డల ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, స్పెషలి స్ట్ వైద్యులను శాశ్వత నియామకం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుగంధిని, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సదామోహన్, వైద్యులు, సిబ్బంది తదితరులున్నారు.

Comments

comments