Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

గోదావరి నది నీటిలో మునిగి విద్యార్థి మృతి

A Boy Dies In Godavari River

మన తెలంగాణ/ఏర్గట్ల: మండలం పరిధి తడపాకల గోదావరి నది నీటిలో ప్రమాదవశాత్తు మునిగి గణేష్ (18) అనే విద్యార్థి మృతి చెందినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. పోలీసులు, గోదావరి నదిలో మొక్కులు తీర్చుకోవడం కోసం వచ్చిన భక్తులు తెలిపిన వివరాలు ప్రకారం… భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గణేష్, సాయికిరణ్ లు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరు కలిసి తడపాకల గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లారు.
ఇద్దరికి ఈత రాని విషయాన్ని మరిచి లోతుగా ఉన్న నీటిలో దిగారు. మృతుడు గణేష్ నీటిలో దిగాగనే మునిగిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితుడు సాయి కిరణ్ కేకలు వేస్తూ అరిచాడు. గోదావరి నదిలో ఉన్న భక్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరి ప్రసాద్ తెలిపారు.

Comments

comments