Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఎడ్ల బండిపై నుండి పడి బాలుడి మృతి

A Boy Dies  In Road Accident  Warangal District
కమలాపూర్(పంగిడిపెల్లి) ః ముక్కు పచ్చలారని ఆ బాలున్నీ ఎడ్లబండి రూపంలో అనుకోని ప్రమాదం కబళించింది.తాతతో కలిసి సరదాగా బండి ఎక్కిన అ బాలున్నీ ప్రమాదం జార విడిచి ప్రాణాలను గాల్లో కలిపేసింది.కన్న కొడుకు ఆ కుటుంబ సభ్యులు సర్కార్ దవఖానాకు తీసుకు వస్తే నాడి పట్టే నాధుడు లేక ఆర్‌ఎంపి వైద్యుడు దిక్కైన పరిస్ధితి నెలకోనడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసిన విషాద సంఘటన గురువారం మధ్యాహాన్నం మండలంలోని పంగిడిపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే కమలాపూర్ మండలంలోని పంగిడిపెల్లి గ్రామానికి చెందిన చెలిక రజనీ-కిరణ్ దంపతులకు కుమారుడు,కుమార్తె ఉన్నారు. ఏడు సంవత్సరాలు ఉన్న చెలిక జశ్వంత్ స్ధానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుకుంటున్నాడు. వ్యవసాయాధారిత కుటుంబమైన రజనీ-కిరణ్‌ల కుటుంబం గురువారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పాఠశాలకు వెళ్ళని జశ్వంత్ తాతతో కలిసి ఎడ్ల బండిపై పొలంకు పెంటను ఇంటి నుండి తరలిస్తున్నారు.

అదే క్రమంలో పెంటను పొలంలో పోశాక తిరుగు ప్రయాణంలో ఎడ్లపై బండిపై జశ్వత్ తాతతో కలిసి ముందు కూర్చుని వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఎడ్లబండిపై నుండి జారి క్రింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమయ్యింది.దీంతో గమనించిన కుటుంబ సభ్యులు,స్ధానికులు వెంటనే జశ్వంత్‌ను స్ధానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకువస్తుండగా మార్గ మధ్యలోనే కన్నుమూశాడు.జశ్వంత్ కోన ఊపిరితో బ్రతికే ఉన్నాడన్న ఆశతో కుటుంబ సభ్యులు బాలున్నీ ప్రభుత్వాస్పత్రికి తీసుకు వస్తే బాలున్నీ చూసే సిబ్బంది లేకపోగా నాడి పట్టుకుని చూసే నాధుడు కరువయ్యారు.రక్త స్రావం అవుతుంది కాటన్ ఇవ్వాలని తెలిపినా సిబ్బంది కాటన్ లేదని చెప్పడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేయగా,ఆస్పత్రిలో అందుబాటులో వైద్యులు లేక ప్రవైట్ వైద్యుడు అక్కడకు రావాల్సిన పరిస్దితి నెలకొనడంపై స్ధానికులు ఆవేథన వ్యక్తం చేస్తున్నారు.ఇంత పెద్ద ఆస్పత్రి కట్టింది ఎందుకని ప్రశ్నిస్తూ వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ప్రమాదవశాత్తు ఎడ్లబండిపై నుండి పడిపోయి కొడుకు చనిపోయిన పుట్టేడు బాధలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా సంఘటన స్ధానికులను కలచివేసింది.

Comments

comments