Home వరంగల్ వింత వ్యాధితో చావుతో పోరాడుతున్న చిన్నారి

వింత వ్యాధితో చావుతో పోరాడుతున్న చిన్నారి

Strange-Diseaseదాతల సహాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
ఖానాపురం : తన తోటి వారితో ఆడిపాడాల్సిన వయస్సులో ఓ చిన్నారి వింత వ్యాధితో బాధపడుతూ చావుతో పోరాడు తుండగా, సదరు చిన్నారి తల్లిదండ్రులు దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన జోతుల యాకేష్‌రావు, మమత దంపతుల కుమారుడు జోతుల సత్య(7) వైద్యులకు అంతుచిక్కన ఓ వింత వ్యాధితో హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత నెలలో చిన్నారి ఆరోగ్యం బాగుండకపోవడంతో తల్లిదండ్రులు నర్సంపేట్ పట్టణంలోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రిలో చూపించారు. కానీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో నర్సంపేట్‌లోని అమృత ఆసుపత్రిలో అనంతరం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఎంతకూ బాబు ఆరోగ్యవంతుడు కాకపోవడంతో వైద్యుల సూచనలమేరకు హైదరాబాద్‌లోని పిల్లల ఆసుపత్రి అయిన రెయిన్‌బో ఆసుప్రతిలో చేర్పించారు. సదరు ఆసుపత్రిలో రూ.40వేల ప్రతి రోజు బాలుని వైద్య ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విన్నవిస్తున్నారు. వరంగల్, నర్సంపేట నగరాల్లో వైద్యం చేయించిన సమయంలోనే రూ.2లక్షలకు పైగా ఖర్చుగా ఇప్పుడు హైదరాబాద్‌లో చికిత్సకు ఇండ్లు, భూములు అమ్మినా సరిపోవడం లేదన్నారు. ఇంకా వైద్యం కోసం తమ వద్ద ఏమి లేదని దాతలుగాని స్వచ్ఛంద సంస్థలుగాని ముందుకు వచ్చి తమ కుమారున్ని బతికించాలని తల్లిదండ్రులు యాకేష్, మమతలు అర్జిస్తున్నారు. ఎవరైనా సహాయం చేయదలచిన దాతలు సెల్‌ః 8099881088/ 8099345686లో సంప్రదించాలని కోరుతున్నారు.