Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

గద్వాల మత్య శాఖలో అవినీతి తిమింగళాలు

a bribe of rs.3 000 for the application fish department

a bribe of rs.3 000 for the application fish department

మనతెలంగాణ/గద్వాలప్రతినిధి: చేపలు విక్రయిస్తూ జీవనం కొనసా గిస్తున్న వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభు త్వం సమీకృత మత్యు అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకో సం రూ.1000 కోట్లును కెటాయించడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా అర్హులైనలబ్ధిదారులకు పెద్ద ఎత్తున సబ్సిడీలను ఇస్తూ వారికి ఆర్థికంగా అండగా నిలబడాలన్నదే ఈపథకం ముఖ్య ఉద్ధేశ్యం. అయితే ప్రభుత్వం చేపడుతున్న పథకానికి అవినీతి జలగలు అంటుకోవడంతో ప్రభుత్వ లక్షం కాస్త నీరుగారిపోతుంది. ఇందుకు జోగుళాంబగద్వాల జిల్లాకు వేధికగా మారింది. సమీకృత మత్యు పథ కం కింద జిల్లాకు రూ.25కోట్ల నిధులు కెటాయించడం జరిగింది. దీని కింద వివిధ రకాల చేపల విక్రయాల పథకాలను ప్రవేశపెట్టి వారికి పెద్ద మొత్తంలో రాయితీ కూడ కల్పిస్తున్నారు. అయితే రాయితీ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి వెళ్లిన అర్హులైన లబ్ధిదారులకు అవినీతి జలగలు దర్శనమిస్తుండడంతో బిత్తర పోతున్నారు. మాకు డ బ్బులిస్తేనే మీ దరఖాస్తు తీసుకుంటామనే తరహాలో బహటంగానే అవి నీతి వేలం పాట పాడుతున్నారు. గద్వాల మత్యు శాఖ కార్యాల యం లో జరుగుతున్న అవినీతి దందాపై ‘మనతెలంగాణ’ ప్రత్యేక కథనం.
సబ్సిడీ ద్వారా ప్రోత్సాహాం…:
మత్యుశాఖలో గుర్తింపు పొంది చేపల వృత్తి చేస్తున్న లబ్ధిదారులను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సమికృత మత్యు అభివృద్ధి పథకంలో రాయితీతో కూడిన పథకాలను ప్రవేశపెట్టింది. ఇం దులో సంచార చేపల అమ్మక వాహన పథకం. రీసర్యులేటరీ ఆక్వా కల్చరీ యూనిట్ . అలంకరణ చేపల యూనిట్ నిర్మాణం. వినూత్న ప్రా జెక్టు. చేపల ఉత్పత్తుల విక్రయ కీయోస్కో. ఇతర. పరిశుభ్ర చేపల రవా ణ వాహనం. 6టన్నుల సామర్థం కల ఇన్సులేటెడ్ ట్రక్కులు. చేప విత్త నాల హచరీస్ నిర్మాణం. విత్తనం చేపల పెంపకం యూనిట్లు. చెరువు సమీపంలో ఏర్పాటు చేసే చేపవిత్తన చెరువుల. పెన్‌కల్చర్. ఐస్ ప్లాంట్ నిర్మాణం. చిన్నచేపల దాణ మిల్లుల నిర్మాణం. వలల /పుట్టీల తయా రీ యూనిట్. చేపల ప్రాసెసింగ్ యూనిట్. ఆక్వా టూరిజం యూనిట్. వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వీటిలో యూనిట్ రకాన్ని బ ట్టి గరిష్టంగా 90శాతంవరకు సబ్సిడీని ఇస్తున్నారు. మిగిలిన 10శాతం డబ్బులను లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. వాస్తవంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఈపోత్సాహాం మత్యుకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉందనేది నేరుగా మత్యుకారులే చెబుతున్న మాట. కాని వీరికి అవినీతి పరులైన కొందరు అడ్డుపడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
దరఖాస్తుకు రూ.3వేలు లంచం…: యూనిట్లు మొత్తం వ్యయం పెద్ద మొత్తంలో ఉండడం దానికనుగుణం గానే సబ్సిడీ కూడ ఎక్కువగా ఉం డడంతో పథకాలకు దరఖాస్తు చేసుకు నేందుకు అర్హులైన లబ్ధిదారుల నుంచి ఆసక్తి ఎక్కువగా ఉంది. దీంతో రో జు కార్యాలయం చుట్టు వంద మంది వరకు దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్నారు. అయితే మత్యు శాఖలో జిల్లా కార్యాలయంలో పనిచేసే నలుగురు వ్యక్తులు దరఖాస్తు తీసుకోవటానికి లంచం అడుగుతున్నారు. ఒక్కో దరఖాస్తుదారుని వద్ద నుంచి రూ.2నుంచి 3వేల వరకు నేరుగానే వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 300 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునన్నారు. అంటే సుమారు రూ.7లక్షల వరకు లంచాల రూపంలో వసూళ్లు చేశార నే ఆరోపణలు బహటంగానే వినిపిస్తున్నాయి. ఇదేమని అన్యాయం అని కొందరు గట్టిగా ప్రశ్నిస్తే నీ దరఖాస్తు తీసు కోం ఎవరికి చెప్పుకుంటా వో… చెప్పుకోపో… అంటూ విసురుగా సమా ధానం చెబుతు దబాయి స్తున్నారని దరఖాస్తు దారులు మనతెలంగాణతో వాపోయ్యారు. మరి కార్యాలయ ఆవరణలో ఇంత పెద్ద ఎత్తున వసూళ్ల దందా జరుగుతుంటే ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నా రు…? అంటే ఇందులో వీరికికూడ ఏమైన భాగముందా..? లేక నిజంగానే వీరి దృష్టి రాలేదా..?
అధికారి ఏమన్నారంటే…:
కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న లంచాల వ్యవహారంపై జిల్లా మత్సు శాఖ అధికారి మధును వివరణ కోరగా మీరు చెబుతున్నట్లు దరఖాస్తు దారులతో ఎవరైన డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తెలిస్తే వారి పై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దరఖాస్తు దారులు నేరుగా వచ్చి ఫిర్యాదుచేసినా సరిపోతుంది. అవినీతికి ఆస్కారమే లేదు. నేరుగా నన్ను కలిస్తే సరిపోతుంది అంటూ మనతెలంగాణకు వివరణ ఇచ్చారు.

Comments

comments