Home దునియా క్రిస్మస్ ఒక్కరోజు పండుగ కాదు

క్రిస్మస్ ఒక్కరోజు పండుగ కాదు

Birth-of-Jesus

‘ఎడ్వెంట్ – ద టైం బిఫోర్ క్రిస్మస్’
దేవుని బిడ్డగా నమ్మే ఏసు ప్రభువు జన్మించడానికి నాలుగు ఆదివారాల ముందుగా ఎడ్వెంట్ ను పాటిస్తారు. సనాతన చర్చిల ప్రజలు ,తూర్పు క్యాథలిక్స్ ఈ నలభై రోజులు ఉపవాస దీక్ష చేస్తారు,ఇది నవంబర్ 15 నుండి మొదలవుతుంది. క్రిస్మస్‌ను జనవరి ఏడవ తారీఖున జరుపుకునే కొన్ని చర్చిలకు ఎడ్వెంట్ నవంబర్ 28 న మెదలవుతుంది.
‘ఎఫిపని’
ఎడ్వెంట్ తర్వాత డిసంబర్ 25 న విందుభోజనంతో మొదలయ్యి12 రోజులపాటు కొనసాగుతాయి ,12 వ రోజు(ట్వెల్త్ నైట్,5 జనవరి) తో సంబరాలు ముగుస్తాయి.చరిత్రను చూసినట్లైతే ఈ పన్నెండు రోజులు విందులు, విలాసాలతో కూడిన సంబరాలు జరుపుకోవడం కనిపిస్తుంది.పన్నెండవ రోజు రాత్రి ఎపిఫని ని జనవరి ఆరున జరుపుకుంటారు.ఈ రోజున క్రిస్టియన్లు జీసస్ పుట్టగానే విచ్చేసిన వైజ్ మెన్(త్రీ కింగ్స్,జీసస్‌కు బాప్టిజం చేసిన వారు) ను గుర్తుచేసుకుంటారు.క్రిస్మస్ కోసం చేసిన అలంకరణను ఇదే రోజు తొలగిస్తారు కొందరు.మరి కొందరు అలంకరణను క్యాండిల్‌మాస్ వరకు కొనసాగిస్తారు.
‘క్యాండిల్ మాస్’-క్రిస్మస్ పండుగ పూర్తవుతుంది
క్రిస్మస్ తర్వాత 40 రోజులకు అంటే ఫిబ్రవరి రెండవ తారీఖున క్రిస్టమస్ సంబరాలు పూర్తవుతాయి ఆ రోజునే క్యాండిల్ మాస్ అంటారు.మేరీ,జోసెఫ్ కలిసి జెరూసలేం లోని జ్యూయిస్ టెంపుల్‌కు వెళ్ళి వారికి బిడ్డను ప్రసాదించినందుకు కృతఙ్ఞతలు తెలుపుకునే రోజుగా క్యాండిల్ మాస్‌ను జరుపుకుంటారు.సనాతన,క్యాథలిక్ చర్చిలలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది.క్యాండిల్స్‌ను ప్రజలకు పంచడమే క్యాండిల్ మాస్ అనే పేరు రావడానికి కారణమయ్యింది.వారి వారి వ్యక్తిగత ప్రార్థనల్లో ఈ క్యాండిల్స్‌ను వెలిగించాలన్న ఉద్దేశ్యంతో వాటిని దానం చేస్తారు. సనాతన చర్చిల్లో వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి జీసస్‌కిచ్చిన మాటను గుర్తుచేసుకుంటారు.తూర్పు,సనాతన చర్చిల్లో చాలా చోట్ల విజిల్ తో క్యాండిల్ బ్లెస్సింగ్ సెర్మనీని జరుపుతారు దీన్లో క్యాండిల్స్‌ను ఒక దగ్గర ఉంచి ప్రార్థన చేసి తెల్లవారుఝామున వాటిని ప్రజలకు అందజేస్తారు.
క్రిస్టియన్ల మొక్కల నమ్మకాలు
హోలీ,ఐవీ,లారెల్,ఫిర్ అండ్ యే వంటి మొక్కలు శీతాకాల అయనాంతంలో వచ్చే పండుగను జరుపుకునేందుకు,దుష్ట శక్తులను పారద్రోలి ఎదుగుదలకు దోహదపడేందుకు కొన్ని మొక్కలను పెంచడమనే పద్ధతి క్రీస్తు పూర్వం నుండి ఉన్నది.పశ్చిమ యూరోప్‌లోని ప్రజలు ఇండ్లలో అలంకరణకు మొక్కలను వాడేవారు,ఆ మెక్కలను క్రిస్టియన్లు పవిత్రమైనవిగా భావిస్తారు.
‘హోలీ’
ఈ మొక్కకుండే ముళ్ళ వంటి ఆకులు జీసస్ శిలువ వేయబడ్డప్పుడు తలకు పెట్టిన ముళ్ళ కిరీటంగా,దానికి కాసే బెర్రీవంటి పళ్ళను శిలువ వేసిన జీసస్ శరీరం నుండి కారిన రక్తపు బిందువులుగా భావిస్తారు.దీన్లో హోలీ మగ చెట్టుగా,ఐవీ ఆడ చెట్టుగా భావిస్తూ ,క్రిస్టమస్ కు ముందుగా ఏ మొక్కనైతే ఇంటికి తీసుకువస్తారో ఆ సంవత్సరమంతా వారింట్లో వారి(ఆడ/మగ) మాటే చెల్లుబాటవుతుందన్న నమ్మకం ఇంగ్లాండ్ లో ఉండేది.
ఐవీ
ఐవీ మొక్క ఎదగడానికి ఒక ఆధారం కావాలి,ఇది ప్రతి మనిషి ఎదగడానికి దేవుడిని దీవెనలు అవసరం అనే అంతర్గత సందేశాన్నిస్తుందని భావిస్తారు.జర్మనీలో ఐవీ మొక్కను ఇంటి ముందు మాత్రమే పెంచాలని అనుకుంటారు.ఐవీ మొక్క ఆకును చర్చి బయట కడితే అది ఉరుములు,మెరుపుల నుండి రక్షిస్తుందని నమ్ముతారు.
లారెల్
లారెల్ పుష్పగుచ్ఛాన్ని తలపై ధరించడం విజయాన్ని సూచిస్తుందన్నది వేల సంవత్సరాలనుండి ఉన్న నమ్మకం.ఇది చెడు మీద దేవుడి విజయానికి సూచనగా భావిస్తారు.
ఫిర్ ఆండ్ యే మొక్కలు
ఫిర్,యే మొక్కలు సతత హరితాలు,ఇది దేవుడితో సహజీవనాన్ని సూచిస్తాయి.ఫిర్ ను క్రిస్టమస్ ట్రీగా చాలా చోట్ల వాడతారు.
రోజ్‌మేరీ
పవిత్ర మేరీ కి ప్రతిరూపంగా భావించే మొక్క రోజ్‌మేరీ.ఈ మొక్క దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడుతుందని నమ్ముతారు.ఫ్రెండ్‌షిప్ మొక్కగా కూడా పిలుస్తారు. మధ్యయుగంలో సంపన్న క్రిస్టియన్లు క్రిస్మస్ రోజు చేసే భోజనంలో ఉండే పందితలతో చేసిన పదార్థాన్ని అలంకరించేందుకు ఈ మొక్కను వాడేవారు.
1700 శతాబ్దాంతంలో రిపాన్ కాథడ్రల్ స్కూల్ లో ఏకంగా క్రిస్టమస్ రోజ్‌మేరీ సర్వీస్ నే మొదలుపెట్టారు.దాన్లో రెడ్ ఆపిల్ పైన రోజ్ మేరీ తీగను ఉంచి స్కూల్ పిల్లలు 2,4,6 పెన్నీలకు ఆ సమాజంలో అమ్మేవారు.
క్రిస్మస్ పూలగుచ్ఛాలు
రోమన్లు వారి ఇంటి ముందు తలుపులకు ఈ పుష్ప గుచ్ఛాలను వేలాడదీయడం వారి స్థాయిని తెలిపేది,ఇది విజయానికి సూచికగా కూడా వాడేవారు.సంపన్న రోమన్ మహిళలు ప్రత్యేక సందర్భాల్లో తలకు అలంకరణగా వీటిని వాడేవారు,ఇది వారి గొప్పదనానికి సూచనగా ఉండేది. రోమన్ రాజులు ఈ పుష్పగుచ్ఛాలను ధరించేవారు,ఒలెంపిక్స్‌లో విజేతలకు వీటిని అందించేవారు.