Home టెక్ ట్రెండ్స్ సిగరెట్ ఫిల్టర్ ఈ ఐఐటియన్ల ఉత్పత్తి

సిగరెట్ ఫిల్టర్ ఈ ఐఐటియన్ల ఉత్పత్తి

Cigarette-Filter

పొగ తాగడం అలవాటయితే అది మానడం అంత సులువు కాదు. సిగరెట్ ప్యాకెట్ మీద ప్రమాదం అని రాసున్నా కూడా మానలేరు. అటువంటి వారికి సిగరెట్ తాగడం వలన వచ్చే ప్రభావాలు తగ్గినా కొంతవరకు మేలు జరిగినట్టే. ఆ ప్రయత్నమే చేశారు ఈ ఐఐటియన్లు. అక్షయ్ తన స్నేహితులతో కలిసి బృందంగా తయారై సిగరెట్ ఫిల్టర్ మాత్రమే కాదు మరిన్ని ప్రయోగాలూ చేస్తున్నారు.”

పొగతాగేవాళ్లకి సిగరెట్ పొగ నుంచి ఉపశమనం. పొగ ద్వారా విడుదల అయ్యే కెమికల్స్‌ను పీల్చుకోకుండా ‘పిపఫ్’ అనే కొత్త ఫిల్టర్ కనిపెట్టారు వారు. పొగతాగేవాళ్లు కనీసం 50 శాతం ప్రమాదకర కెమికల్స్ లోనికి పోకుండా నానో టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కొత్త సాంకేతికతతో చేసిన ఫిల్టర్ ఉపయోగించి పొగను లోనికి పీల్చుకోకుండా చేసుకోవచ్చు. అక్షయ్ సింఘాల్ ఐఐటి రూర్కీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు రెండవ సంవత్సరం చదువుతున్నప్పటి నుంచి నానో టెక్నాలజీ మీద పరిశోధన చేస్తున్నాడు. మనదేశంలో అత్యున్నత నాణ్యత కలిగిన గ్రాఫీన్ నానో మెటీరియల్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తాను చేసే పరిశోధన మానవసమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలన్నది అతని కోరిక. గ్రాఫీన్ ఆధారిత గాలి, నీరు ఫిల్ట్రేషన్ టెక్నాలజీల గురించి విస్త్రతంగా పరిశోదనలు చేశాడు.

మొదటి ఏడాదిలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో లాగ్9 మెటీరియల్‌ను ఏర్పాటు చేశాడు. నానో టెక్నాలజీ ఉత్పత్తి అభివృద్ధి, మెటీరియల్ తయారి కంపెనీ అతని పరిశోధనకి గొడుగు పట్టింది. 2015 ఏప్రిల్‌లో ఆరంభం అయ్యాక ఐఐటి రూర్కీ, ఇన్‌క్యుబేషన్ సెంటర్ TIDES
నుంచి 15 లక్షల రూపాయలు నిధులు సమకూరాయి. ఆ నిధులను సాంకేతికతలు తయారు చేయడానికి, బి2సి ఉత్పత్తులు ఆరంభించడానికి, కార్పొరేట్లకు లైసెన్స్‌లు ఇవ్వడానికి ఉపయోగించారు.

ఎయిర్ అండ్ వాటర్ ఫిల్ట్రేషన్ పనిలో భాగంగా అనుకోకుండా ‘పిపఫ్’ ను కనుక్కున్నారు. ఒకరోజు సినిమాకి వెళ్లినప్పుడు పొగకు సంబంధించి హెచ్చరికల ప్రకటన చూసినప్పుడు సిగరెట్ పొగకు ఫిల్ట్రేషన్ మెటీరియల్ ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు. ఫలితాలు బాగా కనిపించడంతో పిపఫ్ ఆలోచనకి రూపకల్పన జరిగింది. సిగరెట్ల కోసం నానోటెక్నాలజీ ఆధారిత ప్లగాన్ ఫిల్టర్ అది. పొగలో ఉండే టార్, టాక్సిన్లు, అమోనియాలో 50 శాతం, పొగతాగేవాళ్ల లోనికి పోకుండా ఈ ఫిల్టర్ కాపాడుతుంది. ఈ ఫిల్టర్ ధర 20 రూపాయలు.

దాన్ని మళ్లీ మళ్లీ వాడచ్చు. ఐదు సిగరెట్ల వరకు పనిచేస్తుంది. క్యాన్పర్ కారక టాక్సిన్లు లోనికి పోకుండా ఫిల్టర్ చేయడంతో పాటు ఈ పరికరం, దగ్గు రాకుండా, పళ్లు రంగు మారకుండా, నోరు పొగాకు వాసన రాకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా కూడా కాపాడుతుంది. వాడేవాళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా రుచి, ఇతర ఫీల్ గురించి అభిప్రాయాలు సేకరించారు. ఈ పరికరం ఎక్కువగా అమ్ముడు పోవడంతో కొంతమంది స్నేహితులు పక్కకి తప్పుకున్నారు. ఇంకొంతమంది వచ్చి చేరారు.

సిగరెట్లు తాగడం వలన వచ్చే ప్రమాదాలను గురించి ప్రచారాలు చేపట్టారు. ప్రజలకి ప్రమాదం అని తెలుసు కాని డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఫిల్టర్ కొనడానికి మాత్రం మనసు ఒప్పదు. మార్కెటింగ్ అంత సులువు కాదని అర్థం అయింది. అయితే మార్కెట్లోకి ఇటువంటి వినూత్న పరికరం ప్రవేశిస్తే అమ్మకం అంత సులువు కాదని తెలుసు. గుర్‌గాంవ్‌లో సిగరెట్లు అమ్మేవారి దగ్గరే ఇవి అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ ఆఫీసుల దగ్గర కూడా ఇవి అందుబాటులో ఉంచారు. డిమాండ్ పెరిగింది. కాని సరఫరా చేయడం యువ బృందానికి కష్టం అయింది. ఇప్పటికి 600 పై చిలుకు ప్యాక్స్ అమ్మారు. ఒక్కోదానిలో ఐదు ఫిల్టర్లు ఉన్నాయి.

గుర్‌గాంవ్‌లో , ఇంకా డిఎల్‌ఎఫ్ సైబర్ హబ్‌లో పది పన్నెండు మంది రిటెయిలర్స్ ఉన్నారు. ఇంకా లక్షల సంఖ్యలో ప్యాక్స్ అమ్మే లక్షం పెట్టుకుని పనిచేస్తున్నారు. రోజుకి వెయ్యి ప్యాక్స్ తయారు చేస్తారు. రాబోయే ఆరు నెలల్లో రోజుకి పదివేల ప్యాక్స్ తయారు చేయాలనే ప్రణాళికతో పనిచేస్తున్నారు. మరింత పెట్టుబడి కోసం చూస్తున్నారు. తమ ఉత్పత్తిని మార్కెట్లో మరింత బలంగా నించోబెట్టాలంటే ప్యాకింగ్‌లో వినూత్న మార్పులు చేసి. అమ్మకందారులతో మరింత పటిష్టమైన సంబంధాలు ఏర్పాటు చేసుకునే వ్యూహాల్లో ఉన్నారు.

స్టార్టప్‌లుగా నానో టెక్నాలజీ కమర్షియల్ అప్లికేషన్స్‌ను కమర్షియల్‌గా వాడటమే కాదు, పర్యావరణానికి మేలు చేసే మరిన్ని వివిధ ఉత్పత్తుల మీద పనిచేస్తున్నారు. వారి మొదటి ఉత్పత్తి పిపఫ్‌లు. ముందుకి మరిన్ని రకాల ఉత్పత్తులు రానున్నాయి. 2015 లో బిఎమ్‌జె గ్లోబల్ హెల్త్ వారి లెక్క ప్రకారం పొగ తాగేవాళ్ల మార్కెట్ 108 మిలియన్ డాలర్లు. మార్కెట్లో ఈ సిగరెట్లకు కూడా పెద్దస్థాయిలో స్థానం దొరుకుతోంది. సిగరెట్ ఫిల్టర్ వినియోగదా రులు, ఈ సిగరెట్ ఫిల్టర్‌తో పొగ తాగడం వలన వచ్చే ప్రమాదకర ప్రభావాల నుంచి కాపాడుతుంది.

నిజానికి సిగరెట్ల కంటె హుక్కాలు ఎక్కువ ప్రమాదకరం. అందుకే హుక్కాలకు కూడా ఉపయోగపడే పరికరం తయారు చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. మనదేశంలో మధ్య తూర్పు ప్రాంత మార్కెట్లో ప్రవేశించారు. వారి మార్కెట్‌ను ఢిల్లీలో కూడా విస్తరిస్తారు. దానితో పాటే ఇతర మెట్రో సిటీల్లోనూ విస్తరిస్తారు. ఫిల్ట్రేషన్‌తో పాటు కోటింగ్, గ్రాఫీన్ క్వాంటమ్ డాట్ బేస్డ్ ఎల్‌ఇడి డిస్‌ప్లే మీద ప్రాథమికంగా పని ఆరంభించారు.