Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రైతు బంధు ఆర్థిక సాయాన్ని కౌలు రైతులకు అందించిన వైద్యుడు

A Doctor who financed the farmers' financial assistance

మనతెలంగాణ/జగిత్యాలటౌన్: తన వ్యవసాయ భూమికి రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందించి న ఆర్థిక సాయాన్ని కౌలు రైతులకు అందించి తన ఉదారతను చాటుకున్నాడు ఓ వైద్యుడు. జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డికి ధర్మపురి శివారులో 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రూ.56వేలు ఆర్థిక సాయం అందగా ఆ డబ్బును కౌలు రైతులకు అందించి వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. తన భూమిని కౌలుకు సాగు చేస్తున్న రైతులు మల్లయ్య, ఆ ది మల్లు,మల్లన్న, ప్రతాప్‌లకు రూ.56వేల రైతు బంధు ఆర్థిక సాయాన్ని అందించారు. కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రై తు బంధు పథకం ద్వారా వచ్చిన మొత్తాన్ని కష్టపడి పంట పండిస్తున్న రైతులకు మాత్ర మే చెందాలన్న ఉద్దేశ్యంతో ఈ డబ్బును కౌ లు రైతులకు అందించినట్లు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.రైతు బంధు పథకం దేశంలో నే గొప్ప పథకమని, ఈ పథకం బంగారు తె లంగాణకు బాటలు వేస్తోందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ కార్యక్రమంలో భూము ల రాజేష్, బాబుస్వామి తదితరులున్నారు.

Comments

comments