Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

A farmer suicide with financial problems

గుడిహత్నూర్‌: మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన గులే సురేష్(42) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌ఐ రాముగౌడ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… మృతుడు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటు జీవిస్తుండేవాడన్నారు. రెండేళ్ల క్రితం కూతురు పెళ్ళి చేశాడు. పెళ్ళి కోసం చేసిన అప్పు, గత ఏడాది పంట సాగు కోసం బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర నుంచి లక్ష రూపాయలు అప్పు తీసున్నాట్టు తెలిపారు. గత ఏడాది దిగుబడి సరిగా లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేదని, ఈ ఏడాది పంట సాగుకు కావల్సిన అప్పు లభించకపోవడంతో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్టు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Comments

comments