Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఆరోగ్యమే.. మహాభాగ్యం

 

A free medical camp is conducted as well

కరీంనగర్ రూరల్‌: ఆరోగ్యమే.. మహాభాగ్యమని కరీంనగర్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలో జికె యూత్ మరియు గ్లోబల్ మాక్స్ అసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కరీంనగర్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ ముఖ్యాతిథిగా పాల్గొని ప్రారంభించి, వైద్యులచే పరీక్షలు చేయించుకొన్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్ మండలంలోని 30 గ్రామాల్లో, 50 డివిజన్‌ల్లో జికె యూత్ మరియు గ్లోబల్ మాక్స్ అసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అండగా ఉంటుందని, త్వరలో తెలంగాణ ప్రభుత్వం కంటి పరీక్షలు చేయించనుందన్నారు. ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. కరీంనగర్ నియోజక వర్గంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజాలు సద్వినియోగం చేసుకొవాలని ఆయన సూచించారు.ఈ శిబిరాల్లో పరీక్షలతో పాటు మందులను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా ఆ రోగాలను ఆరికట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్నా నీరు పరిశభ్రంగా మారే ఆవకాశాలు ఉండి ప్రజల ఆరోగ్యంగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం మిసన్ భగీరథ ద్వారా సురక్షత మంచినీరు అందించి ప్రజల ఆరోగ్యం కాపాడనుందన్నారు. మండలంలోని 30 గ్రామాలోన్ని, 50 డివిజన్‌ల్లో ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఎంపి వైస్ చైర్మెన్ రాజేశ్వర్ రావు, మొగులోజు వెంకట్, వార్డు సభ్యులు సంపత్ రావు, జికె యూత్ సభ్యులు, గ్లోబల్ మాక్స్ అసుపత్రి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

comments