Home నాగర్ కర్నూల్ చైన్ స్నాచ్ ముఠా.. అరెస్ట్..

చైన్ స్నాచ్ ముఠా.. అరెస్ట్..

A gang involved in chain rackets was arrested

నాగర్‌కర్నూల్ : వరస గొలుసు చోరీలకు పాల్పడుతున్న ముఠాను అచ్చంపేట్ లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు సేష్టన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్‌పి సన్‌ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం…. ముడావత్ శ్రీను (33) పత్లావత్ బాలు (30) పత్లావత్ గోవింద్ (25) వాగ్యావత్ పాండు (27) వాగ్యావత్ రాజు (25)లు ఇటీవల చైన్ చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిఘా ఏర్పాటు చేయాగా నియోజగవర్గంలోని బల్మూర్ మండలంలో అనుమానస్పందంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే చోరీలకు పాల్పడుతున్నట్టు నిందితులు అంగీకరించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి వారి దగ్గరి నుంచి  30 తులాల బంగారు. 2 కార్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు సన్‌ప్రీత్‌సింగ్ చెప్పారు.