Home జాతీయ వార్తలు ప్రేమకు సంకేళ్లు..!

ప్రేమకు సంకేళ్లు..!

A Girl was tied with chain because of Love in Uttar Pradesh

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువకుడిని ప్రేమించిన ఓ యువతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు అమానుషంగా వ్యవహరించారు. 17 ఏళ్ల యువతిని ప్రియుడిని మరిచిపోవాలంటూ గొలుసుతో కట్టిపడేశారు. కన్నబిడ్డ అనే కనికరం లేకుండా భోజనం, నీళ్లు ఇవ్వకుండా దారుణంగా హింసించారు. విషయం తెలుసుకున్న ప్రేమికుడు చాకచక్యంగా ప్రియురాలిని కుటుంబ సభ్యుల చెర నుంచి తప్పించాడు. అనంతరం ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సమయంలో యువతి కాలికి గొలుసు కట్టి ఉండడం కనిపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.