Home జిల్లాలు తెలంగాణ అమరుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

తెలంగాణ అమరుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

harish-roaచేగుంట : తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలను అన్నివిధాల ఆదు కుంటామని మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం చేగుంట మండల పరిదిలోని కర్నాల్‌పల్లి గ్రామానికి చెందిన ఎరువ చంద్రారెడ్డి మణెమ్మల కుమారుడు ఎరువ బాల్‌రెడ్డి ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసినందుకు అతని కూతరు కవితకు ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఉద్యమం ఉధృ తంగా సాగుతున్న సమయంలో ఆంధ్రా నాయకులు రోజు కోమాట మారుస్తున్న సమయంలో చలించిన ఎరువ బాల్‌రెడ్డి తాను తెలంగాణ కోసం 10నెలలో 2012 సంవత్సరంలో చనిపోతున్నాని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న తనంలో ఉద్యమం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ కుటుంబానికి గతంలో ప్రభుత్వం 10లక్షల రూపాయలు ఇచ్చింది. కేసీఆర్ మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ద్వితీయ వార్షికోత్సవం సందర్బంగా జిల్లా వ్యాప్తంగా చనిపోయిన అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించడంతో చంద్రారెడ్డికి ఒక కూమారుడు ఉద్యమంలో చనిపోతే ఉన్న ఇద్దరు కూతుళ్ళలో ఒకరు చదువుకోలేదు. రెండవ కూతురూ కేవలం 10వ తరగతి వరకే చదువు కోవడంతో చిన్న కూతురు కవితకు ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించి సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా మంత్రి తన్నీర్ హరీష్‌రావు చేతుల మీదుగా అనుమతి పత్రాన్ని అందుకున్నారు. మెదక్ డివిజన్‌లో రెవెన్యూ డిపార్టు మెంటులో ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని తల్లి దండ్రులు మణెమ్మచంద్రారెడ్డిలు సంతోషం వ్యక్తం చేసారు.
కొడుకు లేని లోటును చూపించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు :
ఎరువ మణెమ్మబాల్‌రెడ్డి

కన్న కొడు తోడుగా ఉంటూ కడదాక ఆదుకునే వాడు తెలంగాణ ఉద్యమంలో తనవంతు సాయంగా ప్రాణత్యాగం చేసి మాకు కడుపు శోకాన్ని నింపినా అది మరచిపోయేలా మాదేవుడు కేసీఆర్ మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి మా జీవితంలో మళ్ళీ వెలుగు నింపారు. తెలంగాణ సాధించడంలో మా కుమారుడు ఒకడైనందుకు ఆనందంగా ఉందని తెలిపారు.