Home తాజా వార్తలు భార్యను కొట్టి చంపిన భర్త

భార్యను కొట్టి చంపిన భర్త

A husband who murdered his wife with suspicion

 

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఓ భర్త, భార్య పై అనుమానంతో కొట్టి చంపిన సంఘన పాల్వంచ రూరల్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… జిల్లాలోని పాల్వంచ మండలంలోని సీతారామపట్నం మారుతినగర్‌కు చెందిన కందుకూరి శంకర్ భద్రాచలంకు చెందిన తన అక్క కూతురు అరుణ(30)ను 15ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడున్నారు. సజావుగా సాగుతున్న కాపురంలో అనుమానం కలతలు రేపింది. దీనితో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగడంతో గురువారం అర్థరాత్రి శంకర్ తన భార్య అరుణను కర్రతో కొట్టి చంపాడు. చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరించారు. ఈ మేరకు మృతురాలి భర్త (శంకర్‌) పై కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నట్టుగా ఎస్‌ఐ ముత్యం రమేష్‌ తెలిపారు.

A husband who murdered his wife with suspicion