Home జిల్లాలు సమాజంలో జర్నలిస్టులదే కీలక పాత్ర

సమాజంలో జర్నలిస్టులదే కీలక పాత్ర

Untitled-1.jpg2షాద్‌నగర్: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలు స్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ఆరాటపడుతున్న జర్నలి స్టుల సేవలు గొప్పవని సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని షాద్ నగర్ అడిషనల్ ఎస్పి కల్మేశ్వర్ సింగ నెవార్(ఐపిఎస్) అన్నారు. టియు డబ్లు జే(ఐజేయు) మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు గుడుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యం లో మంగళవారం షాద్‌నగర్ డివిజన్‌లోని శివ గార్డెన్‌లో నియోజక వర్గ జర్నలి స్టులకు హెల్మెట్‌ల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షాద్‌నగర్ అడిషనల్ ఎస్పి కల్మేశ్వర్ సంగనెవార్, టియు డబ్లుజే రాష్ట్ర కార్యదర్శి విరాహత్ అలీ, హెచ్‌జేయు అధ్యక్షులు కోటిరెడ్డి, ఎం ఎస్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, టియుడబ్లుజే జిల్లా నేతలు మధు, టివి5 రవిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెల్మెట్ పంపిణీ కార్య క్రమాన్ని ఉద్దేశించి అడిషనల్ ఎస్పి కల్మేశ్వర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత తో జర్నలిస్టులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు విశేషమని అభినందించారు. సమాజంలో నాల్గో స్థంభంగా మీడియా తన బాధ్యతలు నిర్వహిస్తుందని మీడి యా సహాకారం పోలీస్ శాఖకు మరువలేనిదన్నారు. కొన్ని సందర్భాల్లో నిక్క చ్చిగా పోలీసులు వ్యవహరిస్తున్నప్పటికి మీడియా తరపున ఎల్లప్పుడు పోలీస్ శాఖకు సహకారమే అందిందని గుర్తు చేశారు. బాధ్యతగల హోదాలో జర్నలి స్టులు తమ కార్యకలాపాలు కొనసాగించాలని దీనికి పోలీస్ సహకారం ఉంటుం దని అన్నారు. సాధారణంగా జర్నలిస్టులపై పోలీసులకు ఉన్న అభిప్రాయం ఎలా ఉన్నా చివరికి జర్నలిస్టుల సహాకారంతోనే శాంతి భద్రతలకు దోహదపడు తాయని అన్నారు. తాము చేపడుతున్న కఠినమైన చర్యల్లో కూడా మంచిని ఆకాంక్షించి మీడియా సహకరిస్తుందని అభినందించారు. గుడుపల్లి శ్రీనివాస్ చేపడుతున్న సమాజిక సేవా కార్యక్రమాలను ఎఎస్పీ కొనియాడారు. టియుడబ్లుజే రాష్ట్ర కార్యదర్శి విరాహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12వేల జర్నలిస్టు కుటుంబాలు ఉన్నాయని వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అర్హతగల జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం, వైద్య సదుపాయం అందిరికి అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 50 వేల జనాభా కలిగిన ప్రాంతాల్లో అదనంగా రెండు అక్రిడియేషన్ కార్డులను ప్రభు త్వం ఇవ్వాలన్నారు. అక్రిడియేషన్ కార్డుల పంపిణీలో అవకతవకలు జరుగ కుండా ఈ దఫా ఆలస్యమైనా అందరికి కార్డులు వస్తాయని అన్నారు. జిల్లా అధ్యక్షులు గుడుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మర ణించిన సూర్య దినపత్రిక బ్యూరో ఇన్‌ఛార్జీ రవిందర్ వ్యవహారంలో ప్రభుత్వం తరపున 10 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించినట్లు తెలిపారు. ఐదు లక్షల రూపాయలు మొదటి విడుతగా రవిందర్ కుటుంబానికి అందజేశామని అదే విధంగా జిల్లాలో జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెట్‌లను పంపిణి చేసేం దుకు నడుంబిగించానన్నారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి, ప్రభాకర్ రెడ్డిలతో పాటు సీనియర్ జర్నలిస్టులు మోహన్ రెడ్డి, ఎం డి ఖాజాపాషా, వనపర్తి మదు, సాక్షి రవిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిటికేబుల్ ఎండి బొబ్బిలి సుధాకర్ రెడ్డి, జర్నలిస్టులు జాకీర్, శరత్, రఘు, శ్రీశైలం, ఇంతియాజ్, హర్షద్, బాను, గిరి, రాఘవేంద్ర యాదవ్, ఫెరోజ్, మన్సూర్ ఖాన్, శివ, శంకర్‌జీ, కొంగర అర్జున్, శ్రీను, కృష్ణయ్య గౌడ్, వనపర్తి కొండయ్య యాదవ్‌తో పాటు నియోజక వర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.