Home ఆఫ్ బీట్ వీడియోలు జనాలపై పంజా విసిరిన చిరుత !(వీడియో)

జనాలపై పంజా విసిరిన చిరుత !(వీడియో)

Leopard attackedనాసిక్: ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని ఒక్కసారిగా జనవాసంలోకి ప్రవేశించిన చిరుత కనబడిన వారిపై పంజా విసిరింది. ఒళ్లు జలదరించే ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. చిరుత జనాలపై విరుచుకుపడడంతో స్థానికులు అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది, పోలీసులు.. స్థానికుల సహాయంతో చిరుతను పట్టుకున్నారు. చిరుత అటవీశాఖ అధికారులకు పట్టుబడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

A Leopard attacked people in Nashik