Home ఖమ్మం కోతులతో కోటి తిప్పలు

కోతులతో కోటి తిప్పలు

 గ్రామాల్లో విచ్చలవిడిగా కోతుల సంచారం 

 పైర్లపై పడి ధ్వంసం చేస్తున్న వానరులు
 హడలిపోతున్న పిల్లలు, పెద్దలు
 రాష్ట్రపతి దృష్టికి కోతుల సమస్య
monkeysఖమ్మం: కోతులతో హడలిపోతున్నారు జనం. ఎక్కడ చూసినా గుం పులు, గుంపులుగా పల్లె, పట్టణం అనే బేధం లేకుండా స్వైర్య విహా రం చేస్తున్నాయి. కాస్తా యాద మరిస్తే చాలు ఏదీ దక్కని స్థితి. చేతిలో ఉన్నా, తలుపులు తీసి ఉన్నా ఇంతే సంగతులు. ఇళ్లపై కప్పు లు, రేకులు, తాటాకులు అంతే పగలడమో, ఊడపీకడమో జర గాల్సిందే. పిల్లలను ఒంటరిగా ఉంచేందుకు తల్లిదండ్రులు భయ పడుతున్నారు. ఎందుకంటే మీదపడి పిల్లలను గాయపరుస్తున్నాయి. అంతేకాదు గ్రా మీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో, పెరట్లలో కూర గాయలు, ఆకుకూరలు పెంచేవారు, జామ, మామిడి ఇతర పండ్ల చెట్లను పెంచేవారు ఇప్పుడు వాటి ఊసు ఎత్తడం లేదు. గుంపులు, గుంపులుగా కోతులు దేన్నీ వదలడం లేదు. పండ్ల చెట్లపై పడి దూకుతూ విరగొట్టడంతో పాటు, పండ్లు మిగలనివ్వడం లేదు. కూరగాయలు, ఆకుకూరల సంగతి సరేసరి. పంట పొలాలకు కూడా రక్షణ లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు.

విత్తనాలు విత్తి వస్తే గుంపు, గుంపులుగా చేల్లో పడి విత్తనాలు తవ్వుకుని తింటున్నాయి. పత్తి కాపుకు వచ్చిందంటే రైతాం గానికి కోతుల భయం పట్టు కుంటుంది. అసలే కోతులు కదా తినేవి అయితే తింటున్నాయి. లేదంటే ఆగమాగం చేస్తున్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలు కోతుల గురించి పట్టించుకపోవడం లేదు. కోతులను పట్టి అడవిలో వదలాలన్న, కొండమచ్చులను పెంచి కోతుల ఇళ్ల దరి చేరకుండా చూడాలన్నా భారీ వ్యయం అవుతుంది. గ్రామ పంచాయతీలకు ఖర్చు భరించే ఆర్థిక పరిపుష్టి లేకపోవడంతో కోతుల నివారణకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేక పోతు న్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించక పోవడంతో మధిర మండలం మడుపల్లి, గార్లమండలంలోని గార్ల, పుల్లూరు, రూరల్ మండలంలోని ఎం.వెంకటాయపాలెం, ఆరెకోడు గ్రామాల ప్రజలు రాష్ట్రపతిని ఆశ్రయించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మడుపల్లిలో కోతులను పట్టి అడవులకు తరలించే ప్రయత్నం జరిగినా పూర్తిగా జరగలేదు. చివరకు కోతుల వ్యవహారం జాతీయ సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బం దులు తలెత్తే అవకాశం ఉంది.