Home నిజామాబాద్ ఆర్టీసి బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసి బస్సు ఢీకొని వ్యక్తి మృతి

A Man Dies In Road Accident In Nizamabad Dist

ఇందల్వాయి: పోలీస్‌ స్టేషన్ పరిధిలోని గన్నారం స్టేజి వద్ద 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నానక్‌సింగ్ మూత్రానికి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసి ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొట్టడంతో నానక్‌సింగ్ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల్ డిపోకు చెందిన బస్సును, ఆర్టీసి డ్రైవర్ ఇస్తాక్ అలీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని ఎస్ఐ అన్నారు.