Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అమెరికాలో కరీంనగర్ వాసి మృతి

A man from Karimnagar died of heart attack in America

మన తెలంగాణ/కరీంనగర్ క్రైం : కరీంనగర్ వాసి ఇట్టిరెడ్డి భార్గవ్‌రెడ్డి (25) అనే యువకుడు ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చివరి దశలో చేదోడువాదోడుగా ఉంటాడనుకున్న కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారు దిక్కులేని వారయ్యారు. యువకుడి మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోహెడ మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన ఇట్టిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డిపద్మ దంపతులు కాగా బార్డర్‌లో జవానుగా పనిచేసిన వెంకటేశ్వర్‌రెడ్డి అక్కడి నుండి విచ్చేసి అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తూ కరీంనగర్‌లోని శ్రీనగర్‌కాలనీలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ దంపతులకు ఇరువురు కుమారులు సంతానం కాగా వారిలో పెద్దవాడైన ఇట్టిరెడ్డి భార్గవ్‌రెడ్డి (25) ఉన్నత విద్య (యం.యస్) కోసం అమెరికా వెళ్లాడు. మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ల్ళిన అతను యం.యస్ పూర్తిచేసి అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. ప్రతిరోజు తల్లి పద్మకు ఫోన్‌చేసి మాట్లాడే కుమారుడి నుండి ఆ రోజు ఫోన్ రాలేదు. ఏం జరిగి ఉంటుందోనని ఆ తల్లి తల్లడిల్లింది. ఈనెల 7న సాయంత్రం వేళ వారి ఇంటికి ఫోన్ రాగా తల్లి అత్రుతగా వెళ్లి మాట్లాడింది. తన కుమారుడు భార్గవ్‌రెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి సమాచారం విన్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

A man from Karimnagar died of heart attack in America

Telangana Latest News

Comments

comments