Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కారు బోల్తా పడి వ్యక్తి మృతి

A man killed when a car hit him in mahaboob nagar

రాజాపూర్‌: మండల కేంద్రం శివారులో కారు బోల్తా పడిన ఘటనలో వ్యక్తి దుర్మరణం పొందాడు. ఎస్‌ఐ నర్సయ్య కథనం ప్రకారం… అడ్డాకల్ గ్రామానికి చెందిన విశ్వేశ్వర్ హైద్రాబాద్ నుండి మహబూబ్‌నగర్ వైపు కారులో భార్య పిల్లలతో కలిసి బయలుదేరుతుండగా 44వ జాతీయ రహదారి రాజాపూర్ శివారులో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో విశ్వేశ్వర్(40) అక్కడికి అక్కడే మృతి చెందాడు. భార్య పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులతో యాదగిరి గుట్టకు దర్శనం చేసుకొని తిరుగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జడ్చర్ల కమ్యునిటి ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.  మృతుడి తండ్రి ఈశ్వరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Comments

comments