Search
Sunday 18 November 2018
  • :
  • :

ఇరాన్ పార్లమెంట్‌లో కాల్పుల కలకలం

Iran-Parliament

టెహ్రాన్: ఇరాన్ పార్లమెంట్‌లో బుధవారం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. పార్లమెంట్‌లోకి చొరబడిన ఓ తీవ్రవాది భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడినట్లు ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. కాల్పుల్లో ఓ గార్డుకి తీవ్రగాయాలు కాగా, ముష్కరుడి చెరలో పలువురు బందిలుగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

ఇదిలా ఉండగా దక్షిణా తెహ్రాన్ లో అయతల్లా ఖోమైనీకు చెందిన సాయుధుడైన ఒక తీవ్రవాది మౌసోలియం వద్ద కాల్పులు జరిపి పలువురిని గాయపరిచాడు. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారనేది ఇంకా తెలియరాలేదు. అనంతరం ఖొమెయినీ వద్ద సూసైడ్‌ బాంబర్‌ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు భద్రతాధికారులతో సహా 8 మంది గాయపడినట్లు సమాచారం.

Comments

comments