Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కోర్టు ఆర్డర్ ను లెక్క చేయకుండా కొట్టాడు…!

A Man Said Beat Him SI In Medak District

నర్సాపూర్ : గ్రామంలో భూ సమస్య తగాదాలల్లో ఇరువురిని పిలిచి న్యాయం చేస్తానంటు, కోర్టు ఆర్డరును సైతం లెక్క చేయకుండా ఎస్‌ఐ అనరాని మాటలు తిట్టి, కొట్టాడంటూ ,బ్రహ్మణపల్లి గ్రామానికి చెందినా కుమ్మరి యాదయ్య ప్రధమ శ్రేణి న్యాయ అధికారికి తన గోడు చెప్పుకున్నారు. మండల పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామంలో 15/ఆ3 సర్వే నెంబర్ లోని 12 గుంటల భూమి,అదే గ్రామానికి చెందినా కుమ్మరి యాదయ్య తండ్రి చిత్తారి వయస్సు (64) కు చెందిందంటూ ,నర్సాపూర్ కోర్టు 20-6-18 ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే గ్రామానికి చెందిన అంద మహేందర్ ,అంద వీరేషం ,శ్రీనివాస్ తండ్రి సత్యనారాయణ గార్లు దౌర్జన్యంగా 26-6-18 నాడు 15/ఆ3 లోని 12 గుంటల భూమి తమ దంటూ ,ఇరువురు కొట్లాడి మంగళవారం నాడు నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు రావడం జరిగింది. ఈ విషయం పై ఎస్‌ఐ వెంకటరాజాగౌడ్ కలగ జేసుకుని,నాయం చేయవలసింది పోయి కోర్టు ఆర్డర్ ను సైతం లెక్క చేయకుండా తనను బూత్ మాటలు తిట్టి చెయ్యి చేసుకున్నాడని కుమ్మరి యాదయ్య ప్రథమ న్యాయధికారిని సప్రదించారు. ఈ విషయం పై న్యాయమూర్తి స్పందించి పోలీస్ ప్టేషన్‌లో జరిగిన విషయం పై విచారణ చేపట్టాలని సిఐ శ్రీనివాస్ రెడ్డి,న్యాయమూర్తి ఆదేశించారు.

నేను ఎవ్వరి కొట్టలేదు :బ్రహ్మణపల్లి గ్రామంలో 15/ఆ3 సర్వేనెంబర్‌లోని 12 గుంటల భూమి విషయంలో కుమ్మరి యాదయ్య,అంద మహెందర్ ,శ్రీనివాస్,వీరేషం తండ్రి సత్యనారాయణ అను వారు గొడవ పడి పోలీస్ స్టేషన్‌కు రావడం జరిగిందని,వారు ఇరువురు ఒక్కరిని ఒక్కరు మాటలు అనుకుంటున్న సమయంలో ,కూర్చుండి సామరస్యంగా మాట్లాడుకోవాలని చెప్పాను తప్ప నేను ఎవ్వరి కొట్టలేదని ఎస్‌ఐ వెంకటరాజాగౌడ్ తెలిపారు.

Comments

comments