Search
Saturday 21 July 2018
  • :
  • :

కుటుంబ తగాదాలతో వ్యక్తి ఆత్మహత్య

A Man Sucide Attempted In Sangareddy District

న్యాల్‌కల్ ః కుటుంబ తగాదాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలోని హద్నూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుమ్మడి భోజిరెడ్డి తనయుడు వినోద్‌రెడ్డి రాయికోడ్ మండలంలోని కోడూర్ గ్రామానికి ఇల్లరికం వెళ్లాడు. అయితే వినోద్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో హైద్రాబాద్‌లో నివాసం ఉంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. వినోద్‌రెడ్డికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే బుధవారం హద్నూర్ గ్రామానికి చేరుకుని సాయంత్రం గుర్తు తెలియని పురుగుల మందును సేవించగా విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బీదర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని తండ్రి భోజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై వివరించారు.

Comments

comments