Search
Sunday 18 November 2018
  • :
  • :

వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన ప్రయాణికులు..!(వీడియో)

Man was saved by RPF after he attempt suicide: Kurla railway station

ముంబయి: అది దేశ రాజధాని ముంబయిలోని కుర్లా రైల్వే స్టేషన్. ఎల్లప్పుడు ప్రయాణీకులతో కీటకీటలాడుతుంటుంది. ఈ  రైల్వే స్టేషన్ లో సోమవారం ఓ ఘటన ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఆత్మహత్య చేసుకుందామని భావించిన ఓ వ్యక్తి రైలు వస్తుండటాన్ని చూసి, రైలు పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు. ఇది చూసిన ఇతర ప్రయాణికులు పరుగున వెళ్లి బలవంతంగా లేపి ప్లాట్ ఫామ్ పైకి తీసుకెళ్లారు. ప్రయాణీకులు వెంటనే స్పందించడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కాగా, పట్టాలపై పడుకున్న వ్యక్తిని 54ఏళ్ల నరేంద్ర దమాజీ కోటేకర్‌గా గుర్తించారు. కుటుంబ సమస్యల కారణంగానే అతను ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

comments