Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

భార్య అందంగా ఉందని.. అమ్మేయాలనుకున్నాడు…

Man Plans to sell his 'beautiful' wife to Delhi Brothel

న్యూఢిల్లీ: ఏవరైనా అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. అందమైన అమ్మాయి భార్యగా వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. అయితే, హర్యానాలోని పానిపట్ కు చెందిన సద్దాంకు భార్య అందంగా ఉండటమే పరిపాటిగా మారింది. భార్య అందగత్తే కావడంతో అందరూ ఆమెనే చూస్తున్నారని అసూయతో రగిలిపోయాడు. ఎలాగైన ఆమె అడ్డు తొలగించుకోవాలని ఓ ప్లాన్ వేశాడు. మొదట ఆమెను చంపేయాలని అనుకున్నాడు. అయితే, ఆ తరువాత మనసు మార్చుకున్న అతగాడు చంపేస్తే ఏం వస్తుందిలే అనుకున్నాడేమో. ఆ సమయంలో అతడికి ఓ ఐడియా వచ్చింది. భార్యను వ్యభిచార గృహాలకు అమ్మేస్తే ఎంతోకొంత డబ్బు వస్తుందిలే అనుకున్నాడు. దాంతో తన మొదటి భార్య, పిల్లలతో హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు.

అనుకున్నాదే తడువుగా భార్యను తీసుకుని దేశ రాజధాని ఢిల్లీలో వాలిపోయాడు. బిజి రోడ్ లోని వేశ్యగృహాల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ బ్రోకర్‌ను కలిసి తనకు తెలిసి మహిళ ఉందని, ఆమెను అమ్మేద్దామనుకుంటున్నట్లు చెప్పాడు. ఇక్కడే మనోడి కథ అడ్డం తిరిగింది. ఆయన ఏవరినైతే కలిశాడో సదరు వ్యక్తి పోలీస్ ఇన్ ఫార్మర్ కావడంతో విషయం పోలీసులకు చేరింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సద్దాంను అదుపులోకి తీసుకుని విచారించగా తన దుర్మార్గపు ఆలోచన బయటపెట్టాడు. భర్త నిర్వాకం తెలిసిన భార్య షాక్‌కు గురైంది.  పోలీసులు యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె బంధువులకు అప్పగించారు. అనంతరం సద్దాంపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Comments

comments