Home ఆదిలాబాద్ కడెం ప్రాజెక్ట్ పై విషాదం

కడెం ప్రాజెక్ట్ పై విషాదం

A man who went for fishing was killed

కడెం: పరువళ్లు తొక్కుతున్న కడెం ప్రాజెక్ట్ లో  చేపలు పట్టడానికి వెళ్తూ… అక్కడ ఉన్న డివైడర్‌ను ఢీ కొని యువకుడు మృతి చెందాడు. మియపురపు నవీన్(18) రోజులాగే చేపల వేట కోసం భైక్ పై కడెం ప్రాజెక్ట్‌కు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అదుపుతప్పిన అతని బైక్ ప్రాజెక్ట్ పై ఉన్న డివైడర్‌ను ఢీకొంది. దీంతో అతను ఘటనాస్థలిలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టమార్టం నిమిత్తం మృతదేహన్ని ఖానాపూర్ దవాఖానకు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.