Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

ఇండోనేషియాలో మరో భూకంపం

A massive earthquake killed hundreds: Indonesian island of Lombok

రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదు, 319కి చేరిన మృతుల సంఖ్య

మటారం: ఇండోనేషయాలో మరో భూకంపం సంభవించింది. ఆదివారం నాటి భూకంపం వల్ల ఇప్పటికీ తేరుకోని ఇండోనేషియాలోని లాంబోక్‌లో మరోసారి భూకంపం రావడంతో మృతుల సంఖ్య 319కి చేరింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా రికార్డయ్యింది. ఆదివారం నాటి భూకంప బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్న లాంబోక్‌లోనే మరోసారి భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఆదివారం నాటి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదయ్యింది. దీంతో వేలాది ఇళ్లు, మజీదులు, వ్యాపారకేంద్రాలు కుప్పకూలి పోయాయి. బాధితుల కోసం సహాయక బృందాలు గాలింపుని కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల చనిపోయిన వారి సంఖ్య 319కి చేరిందని ఇండోనేషియా చీఫ్ సెక్యూరిటీ మంత్రి విరాంటొ ప్రకటించారు. సుమారు 1400 మంది తీవ్రంగా గాయపడ్డారని, 15 వేల మంది నిరాశ్రయులయ్యారని ఆయన ఇంతకు ముందే తెలిపారు. ఇళ్లు కూలిన వారు టెంట్లు, టార్పలిన్‌ల కింద తల దాచుకుంటున్నారు .బాధితులు తాగు నీరు, ఆహార కొరత, వైద్యం అందక పోవడం వల్ల తల్లడిల్లుతున్నారు. ఆదివారం నాటి బాధితులను ఆదుకోవడానికి వెళ్తున్న తాము మరోసారి భూకంపం రావడంతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని శ్రీలక్ష్మి అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

Comments

comments