చండీగఢ్: పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న అక్కడి ప్రజలు మాత్రం దాన్ని బారి నుంచి బయటపడటం లేదనే చెప్పాలి. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోనే దీనికి నిదర్శనం. కొత్తగా పెళ్లైన ఓ యువతి ‘చిట్టా'(సింథటిక్ డ్రగ్స్) తీసుకుంటుండగా తీసినది ఆ వీడియో. పెళ్లి గాజులు వేసుకున్న సదరు యువతి ఫాయిల్ పేపర్‌పై ‘చిట్టా’ వేసి దానికి కొవ్వొత్తి తో వేడి చేస్తూ పీల్చుకుంటూ మత్తును మజా చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పంజాబ్ లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వోద్యోగులందరికీ డోప్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. అంతేగాక మాదక ద్రవ్యాలను అమ్మేవారు కానీ, స్మగ్లింగ్ చేసే వారికి కానీ మరణశిక్ష విధించేలా ప్రతి పాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.