Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పంచాయతీ పోరు జరిగేనా!

villege-panchayathi-office-

అన్ని విధాలుగా సిద్ధమైన నేతలు
రిజర్వేషన్ తేలకపోవడంతో గ్రామాల్లో నీరసం
పాత పాలక వర్గాలకు ఈ నెలాఖరే గడువు

మన తెలంగాణ/సంగారెడ్డి : పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా..? వాయిదా పడతాయా? ఎక్కడ చూసినా ఇదే చర్చ. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ నలుగురు కలిసినా ఈ ఎన్నికల ముచ్చట్లే. పంచాయితీ పాలక వర్గాలకు ఈ నెలాఖరే గడువు. ఆ తర్వా త కొత్త పాలక వర్గాలైనా రావాలి. లేకుంటే ఇన్‌ఛార్జిలను అయినా నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావడంతో గ్రామాల్లో సందడి ఊపందుకుంది. ఐదేళ్ల క్రితం ఓడిపోయిన వారు, కొత్తగా రేసులోకి వచ్చిన వారు అంతా రెడీ అయ్యారు. చాలా చోట్ల గ్రూపులు కట్టడం కూడా జరిగింది. పార్టీల వారీగా కొందరు గ్రూపులు కట్టగా, మరి కొందరు స్థానిక పరిస్థితులను బట్టి గ్రూపులు తయారు చేశారు. ఏ కులానికి సర్పంచ్ పదవి రిజర్వ్ అయితే, తమ వర్గం నుంచి ఆయా కులస్థులను రంగంలోకి దింపడానికి వీరు జాబితాను రెడీ చేశారు. ఆ విధంగా సంగారెడ్డి జిల్లాలోని మేజర్ పంచాయితీల్లో అనేక మంది సిద్ధమయ్యారు. సంగారెడ్డి మండలంలో అధిక ఆదా యం కలిగిన కంది, ఇంద్రకరణ్‌తో పాటు, కొండాపూర్ మండలంలోని మల్కాపూర్, మల్లేపల్లి, తొగర్‌పల్లి, అనంతసాగర్,  వేణుగోపాల్ రెడ్డికి కూడా విధులు నిర్లక్షం వహించినందుకు షోకాజు నోటీసులు జారీ చేస్తూ కలెక్టర్ ధర్మారెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఇటువంటి నిర్లక్షపు అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అంతేకాకుండా గురువారం నాడు కలెక్టర్ తీసుకున్న క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్ వేటులను నిర్ల క్షపు అధికారులపై ఎందుకు తీసుకోకూడదో కూడా తెలియజేయాలం టూ సంజాయీషీ కోరుతూ ఆదేశించారు. ఇక నుండి జిల్లాలో శాఖాపరమైన నిర్వహణలో అలసత్వం వహిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని మరోసారి జిల్లాలోని అధికారులందరిని కలెక్టర్ గట్టిగానే హెచ్చరించారు.

Comments

comments