Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

179 ఏళ్ల ఫోటోగ్రఫీ

Photo-image

చిత్తాన్ని అలరింపజేసే, కాలాన్ని కళ్లకు కట్టే నిజచిత్తరువుల 

తెల్లవారు లేస్తే కాఫీ కప్పు చేతపట్టుకొని అందుబాటులో ఉన్న దినపత్రికనో, వారపత్రికనో తిరగేసే పాఠకుడిని మున్ముందుగా ఆకర్షించేది వార్త చిత్రాలే… లక్షలాది మంది నిత్యం చూసే అలాంటి చిత్రాలను అందించేది ఫోటో జర్నలిస్టులే…సామాన్యుని మొదలుకొని, మేధావుల వరకు ఉత్తేజపరిచే చిత్రం ‘వేయి పదాల కూడా చెప్పలేని భావాన్ని ఒక ఛాయా చిత్రం చెబుతుంది’ అన్న సామెత ఫోటోకు ఉన్న శక్తి రుజువు చేస్తుంది. దేశ కాలమాన, ఆర్థిక రాజకీయ పరిణామాలన్నింటినీ తన కంటితో ప్రపంచానికి చూపించే ఫోటో జర్నలిస్ట్ నిరంతర శ్రామికుడు. తన ఫోటోలతో అందరినీ ఉత్తేజితుల్ని చేసి ఫోటో జర్నలిజం వృత్తిలో భాగంగా ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో, శారీరక, భౌతిక దాడులు, మానసిక ఒత్తిళ్ళు తట్టుకుని తనపని విజయవంతంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంతో శ్రమకోర్చి తీసిన ఒక మంచి చిత్రాన్ని పది మంది ప్రత్యేకంగా మెచ్చుకున్నప్పుడు కలిగే సంతృప్తి చెప్పగలది కాదు.

గతాన్ని, వర్తమానాన్ని భవిష్యత్ తరాలకు చూపించే అద్భుత కళే ఫొటోగ్రఫీ. కనురెప్పపాటు కాలంలో క్లిక్‌మన్న వెలుతురుతో కూడిన చిరుసవ్వడి. దశాబ్దాలు, శతాబ్దాల కాలంపాటు శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకంగా, అనుభూతిగా మిగిలిపోతుంది. ఛాయా చిత్రం ఆవిర్భవించి ఈ ఆగస్టు 19 నాటికి 179 సంవత్సరాలు అయింది. జరుగుతున్న విషయాలను, సంఘటనలను వేల మాటలతో వర్ణించి చెప్పే దానికంటే ఒక్క ఫొటో చూస్తే అనంతకోటి భావాలు చూపరుల మనసుల్లో ఓలలాడుతాయి. ప్రేయసీ ప్రియుల మనోభావాలకు అద్దం పట్టేది ఛాయాచిత్రమే. ఇంతెందుకు పెళ్ళి చూపుల కోసం ముందుగా మనం పంపమనేది, పంపించేది, చూసేది ఫొటోనే కదా! మన కంటిచూపు చేరని చోట, కెమేరా కన్ను సాయంతో చూడగలం. లియోనార్డో డావిన్సీ 1559వ సంవత్సరంలో గుహలాంటి చీకటి గది రూపకల్పనకు శ్రీకారం చుట్టడంతో ఫొటోగ్రఫీకి బీజం పడింది. అప్పటి నుండి శాస్త్రవేత్తలు, అవిరళకృషి తోడై చివరికి 1839 ఆగస్టు 19వ తేదీన ఫ్రాన్స్‌లో ‘ఫొటోగ్రఫీ’డేగా గుర్తింపు పొందింది. ఆనాడు సాంకేతిక ప్రక్రియగా ప్రారంభమైన ఫొటోగ్రఫీ ఈనాడు వృత్తిగా స్థిరపడింది. బ్రీచ్ జోసఫ్ సిసాఫర్ అనే శాస్త్రవేత్త ఈ ఫొటోగ్రఫీని వెలుగులోకి తెచ్చాడు.
ఆ తర్వాత రాజా దీన్ దయాళ్ శర్మ మనదేశంలో వ్యాప్తి చెందడానికి కారణమయ్యారు. 1854 మే 26వ తేదీన విలియవ్‌ు, హీవ్‌ు అనే సోదరులిద్దరూ సూర్య గ్రహాన్ని తొలిసారిగా ఫొటోతీయగలిగారు. నెల్సన్ అనే శాస్త్రవేత్త తల్లి గర్భంలో శిశువు రూపుదిద్దుకునే మార్పుల గురించి పదేళ్ళపాటు శ్రమించి ఎన్నో ఫొటోలు తీయగలిగారు. పెరంబదూర్‌లో రాజీవ్‌గాంధీని చంపిన హంతకులను గుర్తించేందుకు కీలకమైన సాక్ష్యాలను అందించింది ఫోటోలే. ఈసంఘటనలో ఫొటోలు తీస్తున్న ఫొటోగ్రాఫర్ కూడా బాంబుపేలుడుకు ఆహుతైపోయాడు. కాని సంఘటనా స్థలంలో ెేురా పడివుండటం, అది పోలీసులకు దొరకడం, దీని ద్వారా వచ్చిన ఫొటోల ఆధారంగా హంతకులను గుర్తించే మూలాధారాలను కనుగొనడం అందరికీ తెలిసిందే. ఇంతెందుకు ఉదయాన్నే వార్తాపత్రిక చూస్తున్నప్పుడు ముందుగా మనచూపు వార్తవైపుకంటే ఫొటోల మీదకే వెళ్తుంది. ఫొటోకు అంతటిశక్తి వుంది. కార్టూన్ వూహ అనుకుంటే, వార్తా చిత్రం వాస్తవం. ఫొటోగ్రఫీ 19వ శతాబ్థంలో ప్రసార సాధనాల్లో ఒక ముఖ్యభాగ మయింది. 1904లో డైలీ మిర్రర్ అనే బ్రిటీష్ పత్రిక వార్తకు సంబంధించి ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలిపే దృశ్యాన్ని ముద్రించి విస్తృతమై పాఠకుల అభిమానాన్ని సంపాదించింది. దీంతో ప్రెస్ ఫొటో ఏజన్సీలు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఇంకా చెప్పాలంటే పత్రికలు, వార్తా విలేకర్లతోపాటు ప్రత్యేకించి ఫొటోలు తీయడం కోసం ఫొటోగ్రాఫర్లను నియమించడం మనకు తెలుసు. ఢిల్లీకి చెంది న రఘురావ్‌ు, ఎస్.పాల్ సోదరులు ముంబయ్‌కి చెందిన ముకేష్ వంటి ఫొటోగ్రాఫర్లు ఫొటో జర్నలిజం పట్ల ఆసక్తిని పెంచారని చెప్పవచ్చు. శ్రీ దిలీప్ బెనర్జీ, శ్రీమతి సిప్రాదాస్, శరత్ సక్సేనా, గంగాధర్, రవీందర్‌రెడ్డి గొప్ప ఫొటోగ్రాఫర్లుగా సమాజంలో గుర్తింపు పొందారు. బ్రిటిష్‌కి చెందిన ది రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ, అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫ్ సొసైటీ ఆఫ్ ఆమెరికా, మనదేశంలో ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ వంటి సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. హైదరాబాద్‌కు చెందిన రవీందర్‌రెడ్డి, బాబ్రీమసీదు విధ్వంసాన్ని తన కెమెరాలో బంధించారు. టైైవ్‌‌సు లైఫ్ పత్రికలకు ప్రత్యేక ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తున ్న దయనీత్‌సింగ్ ఫొటోగ్రాఫ్‌లో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. జరిగిపోయిన సంఘటన ఫొటో తీయకపోతే ఆ సంఘటన మనకోసం మళ్ళీ జరగదు కదా! ఫొటోగ్రఫీలో పద్మశ్రీ పొందిన తొలివ్యక్తి టి.కాశీనాథ్ మన తెలుగువాడు కావడం విశేషం. మనిషి వేసే ప్రతి అడుగు సమాజం వేసే పురోభివృద్ధి అడుగుగా భావించాలి. హృదయాన్ని కదిలించినా, మనసును రగిలించినా, కొత్త అనుభూతుల్ని సృష్టించినా, అనంతమైన ఆకాశాన్ని అరచేతికి అందివ్వగల శక్తి కెమేరాకన్నుకే వుందనడంలో సందేహం లేదు. అలాగే మన రాష్ట్రానికి చెందిన తమ్మా శ్రీనివాసరెడ్డి ఫొటోగ్రఫీలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు అందుకున్నారు. ఈయన తీసిన ఎన్నో ఫొటోలు దేశ విదేశాలకు చెందిన ఎన్నో పత్రికలు నిత్యం ప్రచురిస్తూనే వున్నాయి. మచిలీపట్నానికి చెందిన బి.రమణ సునామి సమయంలో మంగినపూడి బీచ్‌లో తీసిన ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా పత్రికలు ప్రచురించాయి. ప్రశంసలందుకున్నాయి. శాస్త్ర పరిశో ధనల్లో, వాణిజ్య ప్రకటనల్లో, జర్నలిజం రంగంలో ఫొటోగ్రఫీ రాణిస్తోంది. కమర్షియల్ ఫొటోగ్రఫీ, ఆర్ట్ ఫొటోగ్రఫీ, ఙవతీ్‌ఱవఎవఅ్ జూష్ట్రశీ్‌శీతీజూష్ట్ర ఫొటో జర్నలిజం, రిప్రోగ్రఫీ, సైంటిఫిక్ ఫొటోగ్రఫీ, సినిమా టోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటూ ఎన్నో రకాలుగా అభి వృద్ధి చెందింది ఫొటోగ్రఫీ. దేశంలో యూనివర్సిటీ ఆఫ్ ఎశీతీవ, శ్రీశ్రీష్ట్ర అఱఙవతీఱ్, జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ వంటి ఎన్నో విశ్వ విద్యాలయాలు ఫొటోగ్రఫిక్ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు లను అందిస్తున్నాయి. ఏకాగ్రత, నిశిత పరిశీలన, కళాదృష్టి, దృశ్యాత్మక ఊహాశక్తి, జ్ఞాపకశక్తి, ఆత్మ విశ్వాసం, సృజనాత్మకత, ఓర్పు, అప్రమత్తతవీన్నిటి కలయికే ఫొటోగ్రాఫర్. తెలుగులో ఈయన్ని ఫొటో కారుడు అనొచ్చు. విశ్వాన్ని సైతం తన పెట్టెలో బంధించే శక్తి కెమేరాకుంది. కొండను సైతం తనలో దాచేసుకుంటుంది. ఇంతెందుకు ఎంతటివాడైనా తాను తీయించుకున్న ఫొటో చూసి ముచ్చటపడక తప్పదు. అందుకే క్లిక్‌క్లిక్‌లో కిక్ వుందంటాను…

Comments

comments