Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసి, ఆర్‌టిఎ సమన్వయ లోపం

 A private cab from private travels

మనతెలంగాణ/సిటీబ్యూరో: రోజు రోజుకు హైదరాబాద్ విస్తరిస్తూ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. ప్రారిశ్రామిక,  వ్యాపార కేంద్రాలతో పాటు నివాస ప్రాంతాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థ మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఆర్‌టిసి కొన్ని రూట్లకే పరిమితంమైందనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్‌ఎమ్‌టిఎస్ సౌకర్యం ఉన్నా అది మూడు మార్గాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజా రవాణాలో ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ప్రయాణికుల అవసరాలను ప్రైవేట్ వాహన దారులు సొమ్ము చేసుకుంటున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను  చేరవేస్తుండటంతో తరుచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రజా రవాణా చేస్తున్న  ప్రైవేట్ వాహనాలను కట్టడి చేయాల్సిన  రవాణా శాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి  నగరంలో తిరిగే క్యాబ్, ఆటోలు సెవన్ సీటర్‌లు  నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయి. దీంతో ఆర్‌టిసి  ఆదాయానికి గండి పడుతోంది. గతంలో ఈ విషయంపై దృష్టి పెట్టిన అధికారులు  వీటిపై కొరడా ఝళిపించారు. సుమారు ఆరు నెలల పాటు ఆర్‌టిసి,ఆర్‌టిఎ అధికారులు కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. దీంతో ప్రైవేట్ వాహనాల సంఖ్య తగ్గడంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటుతో పాటు ఆదాయం కూడా పెరిగిందని అధికారులు తెలిపారు. ఆర్‌టిసి,ఆర్‌టిఎ  కలిసి పని  చేయడంతో  ఆర్‌టిసి  లాభాలు రావడంతో పాటు  తరుచు  జరిగే ప్రమాదాల నుంచి కూడా ప్రయాణికులను కాపాడవచ్చని నాడు  అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం నగరంలో  పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. నగరంలో  ప్రైవేట్ వాహనాలు  వాటి స్పీడ్‌ను పెంచాయి. ఆర్‌టిసి,ఆర్‌టిఎ  అధికారులు కలిసి పని చేసిన దాఖలాలు ఈ నడిమధ్య కనిపించడం లేదు. ఇతర జిల్లాలకు చెందిన ప్రైవేట్ వాహనాలు శివారు ప్రాంతాల్లో యథేచ్చగా ప్రజారవాణా చేస్తున్నాయి.నగరంలో నుంచి శంషాబాద్  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మెహదీపట్నం సరోజనిదేవి కంటి ఆసుపత్రి నుంచి ఆరాంఘర్ చౌరస్తావరకు 11 కిలో మీటర్లు, అక్కడ నుంచి శంషాబాద్‌కు 10 కిలో మీటర్ల దూరం ఉంది. ఈ  మార్గంలో కేవలం 20 నుంచి 25 నిమిషాల్లో శంషాబాద్ చేరుకుంటున్నారు. ఈ మార్గంలో ఆర్‌టిసి బస్సులు తగినంత లేక పోవడంతో అటుగా వెళ్ళేవారు పూర్తిగా ప్రైవేట్ వాహనాల్లోనే రాక పోకలు సాగిస్తున్నారు.

ఒక వేళ మెహదీపట్నం నుంచి శంషాబాద్‌కు వెళ్ళాలంటే గంట సమయం పడుతోంది.  ఈ క్రమంలో ప్రయాణిలుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అదే విధంగా శంషాబాద్  అవుటర్ రింగ్ రోడ్డు చౌరస్తా నుంచి గచ్చి బౌలీ వరకు వచ్చేందుకు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులు అవసరాలకు అనుగుణంగా ఆర్‌టిసి రైలు ప్రయాణ సౌకర్యాలు  లేక పోవడంతో డబ్బులు ఎక్కువ చెల్లించి అయినా వెళ్ళాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ విధంగా నగర శివారు ప్రాంతాల్లో ఆర్‌టిసి బస్సు, రైలు అందుబాటులో లేక పోవడంతో ప్రైవేట్ వాహనాలే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలను  ఆర్‌టిసి అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా అడ్డుకోలేక పోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న  ప్రైవేట్ వాహన దారులు రెండింతల  చార్జీలు వసూలు చేస్తూ  అందినంత దోచుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్‌టిసి,ఆర్‌టిఎ అధికారులు సంయుక్తంగా పని చేసి ప్రైవేట్ వాహనాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను  అరికట్టాలని పలువురు సూచిస్తున్నారు.

Comments

comments