Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం

talk2

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్ : ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం  కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను కలెక్టర్  స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వారంలోగా పరిష్కారించాలన్నారు. దరఖాస్తును పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించాలన్నారు. ఈ శాఖకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉందని శాఖల వారీగా ఆన్‌లైన్ స్కీన్‌ద్వారా సమీక్షించారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాల్సి ఉందని సూచించారు. జిల్లాకు 1లక్ష 16వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 41వేల మరుగుదొడ్లను మాత్రమే నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగతా 76వేల మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా లబ్దిదారులను ప్రోత్సహించి నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులకు లక్షం నిర్థేశించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బయోమెట్రిక్ హాజరును జిల్లా అధికారులు వెంటనే తమతమ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసి శివలింగయ్య, జిల్లా రెవెన్యూ అధికారి రమేష్‌రాథోడ్,  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments