Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది  కొరతకు సత్వర పరిష్కారం

laxmi-reddy-mbnr-healthబాలానగర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత వేధిస్తున్న విషయంపై సత్వరమే పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ రెండు మూడు నెలల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి అన్నారు. శుక్రవారం బాలానగర్ మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలోని హోటల్ ఆకర్ష్ గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు మూడు నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను నియమించే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అధే విధంగా 24 గంటల వైద్య సదుపాయం కూడా అందించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. బాలానగర్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన 145 వాహనాలు అత్యాధునిక సదుపా యాలతో అంబులెన్స్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బాలానగర్ మండలంలోని రాజాపూర్‌లో జరుగుతున్న ప్రమాదాలపై ఆయన స్పందిస్తూ త్వరలో రాజాపూర్‌లోనే 108 ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. అదే రోజున బాలానగర్‌లో బ్రిడ్జి, ఇబ్రహీంపల్లిలో నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అచ్చంపేట ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు పాలనకు బ్రహ్మరథం పట్టినట్లేనని దీనితో ప్రతిపక్షాలకు ప్రజలు బుద్దిచెప్పారని అన్నారు. తెలంగాణలో అభివృద్దిలో అందరు భాగస్వాములు కావాలని అన్నారు. ఈ సమావేశంలో బాలానగర్ జడ్పిటిసి పట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

Comments

comments