Home ఆఫ్ బీట్ ఈ ఆసీస్ క్రికెటర్ కు ఏమైంది…?(వీడియో)

ఈ ఆసీస్ క్రికెటర్ కు ఏమైంది…?(వీడియో)

A Ragged, old man Turned up at a Local Park to Play Cricket with the Kids

ముంబయి: ఆస్ట్రేలియా మాజీ మీడియం పేసర్‌ బ్రెట్‌ లీ ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌ పదకొండో సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే లీ తాజాగా మారువేషంలో ముంబయి వీధుల్లోకి వెళ్లి చిన్నారులతో గల్లీ క్రికెట్‌ ఆడి సందడి చేశాడు. లీ పొడవాటి గడ్డం, నెరిసిన జట్టుతో వృద్ధుడిలా మారువేషం వేసుకొని వీధుల్లో క్రికెట్‌ ఆడుతున్న పిల్లల వద్దకు వెళ్లాడు. అనంతరం పిల్లలను అడిగి మరీ తాను కూడా క్రికెట్ ఆడాడు. మొదట ఆట గురించి తనకేమీ తెలియదన్నట్టు నటించాడు బ్రెట్‌లీ. కొద్దిసేపటి తర్వాత బ్యాట్ చేతపట్టి బంతులను బౌండరీలకు తరలించారు. అలాగే బౌలింగ్ లోనూ చిన్నారులను బెంబేలెత్తించాడు. దీంతో చిన్నారులు లీని మీరు ఎవరూ, ఇంతా బాగా క్రికెట్ ఆడుతున్నారేంటని ప్రశ్నించిడంతో తాను ఎవరో చెప్పి చిన్నారులను సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాడు. దీంతో  చిన్నారులు ఆనందంతో గంతులేశారు. చిన్నారులకు ఆటోగ్రాఫ్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇటీవల క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ముంబయి వీధి బాలలతో క్రికెట్ ఆడిన సంగతి తెలసిందే.