Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

accedent
ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మృతి
మోరెనా: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం ఉద యం మోరెనా జిల్లాలోని గం జిరాంపూర్ సమీపంలోని చౌరస్తా లో ఇసుక లోడ్ తో వస్తున్న టాక్టర్ అదుపు తప్పి జీపును ఢీకొట్టడంతో 15 మంది మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 12మంది అక్కడి కక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన ముగ్గురు ఆస్పత్రిలో మృతి చెందారు. మరో ఐదుగురు క్షతగాత్రులను మోరెనా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వారు తెలిపారు. గ్వాలియర్ జిల్లాకు చెందిన మృతులు గురుగాంలో సంతాప సమావేశానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు ఎస్‌పి అమిత్ సంఘీ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారైనట్లు ఆయన తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినట్లుగా ఆయన తెలిపారు. మృతులు ప్రేమా మహోర్, వీనా మహోర్, పరోబాయి, విజయ్‌సింగ్ మహోర్, కుంటోబాయి మహోర్, బల్లూ మహోర్, భూరి మహోర్, గీతాబాయి మహోర్, రామ్‌నివాస్ మహోర్, రాజ్బీర్ మహోర్, రాంబేటి మహోర్, అంతర్‌సింగ్ మహోర్, కైలాష్ మహోర్, ఉత్తమ్ మహోర్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Comments

comments