Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మల్టీప్లెక్స్‌లపై వరుస దాడులు

A series of attacks on multiplexes

రెండవ రోజూ కొనసాగిన తూనికలు, కొలతలశాఖ తనిఖీలు
26 మల్టీప్లెక్స్‌లు, 21 థియేటర్లపై73 కేసులు
నిబంధనలు పాటించని వాటిపై 34 కేసుల నమోదు

మన తెలంగాణ / హైదరాబాద్ : మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్ల తూనికలు, కొలతలశాఖ అధికారులు రెండవ రోజు కూడా దాడులను కొనసాగించారు. పలు మల్టీప్లెక్స్‌లు, థియేటర్లపై విసృతంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన పాటించని వాటిపై 34 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ మహానగరంతో పాటు హెచ్‌ఎండిఎ పరిధిలో రెండవ రోజు శుక్రవారం ఎనిమిది మల్టీప్లెక్స్, థియేటర్లలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని ఆరింటిపై 19 కేసులు నమోదు చేసిన అధికారులు 21 సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో తనిఖీలు చేసి నిబంధనలు పాటించని 14 థియేటర్లపై 15 కేసులు నమోదు చేశారు. సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్‌ల్లో తినుబండరాలతో పాటు శీతల పానీయాలు, నీళ్ల బాటిళ్ళను ఎంఆర్‌పి ధర కంటే నాలుగైదు రేట్లు అధికంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ధరల్లోనే కాకుండా తూకాల్లోనూ మోసాలు చేస్తున్నట్లు తూనికలు, కొలతలశాఖకు భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు పలుమార్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లతో పాటు పలు గోదాములపై కూడా దాడులు చేశారు. నిబంధనలు పాటించని వాటిపై కేసులు నమోదు చేయడమే కాకుండా కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకే ఉత్పత్తి, ఒకే ధర విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు నూతన చట్టాన్ని రూపొందించారు. దీన్ని ఈ నెల ఒకటి నుంచి అమలు చేసేందుకు ఉత్తర్వులను జారీ చేసి న ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ముందుగానే వాటి యాజమానులకు అవగాహన కల్పించిన అధికారులు నిబంధనలను ఉల్లఘించే సహించేది లేదని హెచ్చరికలను సైతం జారీ చేశారు. ఇందులో భాగంగానే నూతన చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు అధికారులు రెండు రోజులుగా విసృత్తంగా తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు అధికారులు మొత్తం 26 మల్టీప్లెక్స్‌లు, 21 సినిమా థియేటర్లల్లో తనిఖీలు నిర్వహించి 73 కేసులను నమోదు చేశారు. అధికారుల తనిఖీలు సందర్భంగా ఏడు థియేటర్లను అధికారులు రూపొందించిన నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నూతన అమలు నేపథ్యంలో ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 200 ఫిర్యాదులు అందించినట్లు అధికారులు తెలిపారు. వాట్సప్ నెంబర్‌కు 7330774444, టోల్ ఫ్రీ నెంబర్ 180042500333 నెంబర్లకు ఫిర్యాదులు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు కూడా పలు మల్టీప్లెక్స్‌లపై దాడులు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని హైదరాబాద్ సెంట్రల్ పివిఆర్‌పై మూడు కేసులు, హైటెక్ సిటిలోని ఐనాక్స్ ఇన్ ఆర్బిట్ మాల్ 4, సినీ పోలీస్ శంషాబాద్ 4, ఏషియన్ సినిమా అత్తాపూర్ 2,మూసాపేటలోని ఏషియన్ లక్ష్మికళ, బంజారాహిల్స్‌లోని ఆర్‌కె.సినిమాపై 4 కేసులు నమోదు చేశారు. దీంతో పాటు కర్మన్‌ఘాట్‌లోని ఇంద్ర, నాగేంద్ర, దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకట్రాది, కోణార్క్, మెగా, ఏషియన్ శివగంగా, మల్లాపూర్‌లోని రాఘవేంద్ర, కాప్రాలోని శారదా, నాచరంలోని వైజయంతి, ఆర్‌టిసి క్రాస్ రోడ్‌లోని సంధ్య 70, సంధ్య 35, సుదర్శన్ 35, మియాపూర్‌లోని సాయిగంగా థియేటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో కేసులు నమోదు చేశారు.

Comments

comments