Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ప్రేమపై పిహెచ్‌డి చేసే జంట కథ!

love-phdబిఆర్‌ఎస్‌ఐ మూవీస్ బ్యానర్‌పై గోపీనాథ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘21st సెంచరీ లవ్’. విష్ణుప్రియ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నరేందర్.పి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ప్రతాని రామకృష్ణగౌడ్ బిగ్ సీడీని, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీనాథ్ మాట్లాడుతూ “పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్‌గా సుమారుగా యాభైవేల మంది విద్యార్థులకు శిక్షణనిచ్చాను. అసలు మనిషి మానసికంగా ఎందుకు కృంగిపోతున్నాడు..? చనిపోయే స్థాయికి ఎందుకు వెళ్తున్నాడనే విషయాల గురించి రీసెర్చ్ చేశాను. నా అనుభవాల ద్వారా ఈ సినిమా కథను సిద్ధం చేశాను. స్నేహానికి, ప్రేమకు, ఆకర్షణకు నిజమైన నిర్వచనం చెప్పే కథతో ఈ సినిమా చేశాం. ప్రేమపై పిహెచ్‌డి చేసే జంట కథే ఈ చిత్రం. ఇందులో ఒరిజినల్ లవ్‌స్టోరీని చూపిం చాం”అని అన్నారు. సంగీత దర్శకుడు కనిష్క మాట్లాడుతూ “సినిమాలో పరిస్థితులకు తగ్గట్టుగా ఆరు పాటలుంటాయి. సినిమా స్క్రిప్ట్ వినగానే నాకెంతో బాగా నచ్చింది”అని తెలిపారు. నిర్మాత నరేందర్ మాట్లాడుతూ “నేటి తరానికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. యూత్‌కు మంచి సందేశాన్నిచ్చే చిత్రమిది”అని చెప్పారు. ఈ కార్యక్ర మంలో రాజ్ కందుకూరి, బెక్కం వేణు గోపాల్, సాయి వెంకట్, విష్ణు ప్రియ, నాగబాబు, దామోదర్‌ప్రసాద్, బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments