Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సెల్ఫీకి మరో నిండు ప్రాణం బలి

man-dies-with-selfie-done

మెల్‌బోర్న్: సరదాగా గడపాలని స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటూ సముద్రంలో పడిపోయి భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఆల్బనీలోని పోర్ట్‌టౌన్ సమీపంలో 40 మీటర్ల ఎత్తైన రాయి మీద నుంచి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి అంకిత్, స్నేహితులతో కలిసి పోర్ట్ టౌన్‌కు వెళ్లాడు. సెల్ఫీ కోసం అందరూ అక్కడున్న రాళ్లమీదకి వెళ్లి సెల్ఫీ దిగుతుండగా అంకిత్ కాలు జారి సముద్రంలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సముద్రం నుంచి అంకిత్ మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

Comments

comments