Home అంతర్జాతీయ వార్తలు ఎయిర్‌పోర్ట్‌లో టోర్నాడో బీభత్సం..!(వీడియో)

ఎయిర్‌పోర్ట్‌లో టోర్నాడో బీభత్సం..!(వీడియో)

Tornado hit Antalya Airportఅంకారా: ట‌ర్కీలోని అంటల్య విమానాశ్ర‌యంలో టోర్నాడో బీభ‌త్సం సృష్టించింది. భీక‌ర‌మైన ఆ టోర్నాడో ధాటికి ఎయిర్‌పోర్ట్‌లోలోని విమానాలు పాక్షికంగా దెబ్బ‌తిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. గత శ‌నివారం ఈ టోర్న‌డో ప్రతాపం చూపించింది. కాగా, గ‌త నాలుగు రోజుల్లో ఇది ఐదో టోర్నాడో అని అక్కడి అధికారులు వెల్లడించారు. టోర్నాడో వచ్చిన సమయంలో ఓ విమానం ఎక్కుతున్న 12 మంది ప్ర‌యాణికులు స్వ‌ల్పంగా గాయ‌ప‌డినట్లు సమాచారం. టోర్నాడో ధాటికి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎయిర్‌బ‌స్‌లు, మినీబ‌స్సులు, ఎయిర్‌స్టెయిర్స్ అన్నీ కొంత దూరం కొట్టుకుపోయాయి.