Home ఆఫ్ బీట్ వీడియోలు అమానుషం: అత్తపై కోడలి దాష్టీకం..!(వీడియో)

అమానుషం: అత్తపై కోడలి దాష్టీకం..!(వీడియో)

A video was viral today in which a elderly lady was tortured by her daughter in law

కోల్‌కతా: అత్తపై కోడలు అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని గరియా ప్రాంతంలో చోటుచేసుకుంది. అత్తపై కోడలి దాష్టీకాన్ని పక్కంటి వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే 5 లక్షల వ్యూస్, 8300 లైక్స్, 25000 షెర్లు సాధించింది. 70 ఏళ్ల వృద్ధురాలు కొడలికి చెప్పకుండా పూలు కోయడమే ఆమె చేసిన తప్పు. అంతే… నాకు చెప్పకుండా పూలు ఎలా కోశావంటూ పెద్దావిడా అని కూడా చూడకుండా జుట్టుపట్టుకొని కొట్టడం వీడియో రికార్డైంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులకు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా కొడలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కోల్‌కతా పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. యశోద పాల్ అనే 70 ఏళ్ల వృద్ధురాలికి మతిమరుపు ఉందని, కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కొడలు స్వప్న పాల్ వద్ద ఉంటోంది. అయితే తరచూ అత్తపై కొడలు చేయిచేసుకుంటుందని ఇరుగుపొరుగువారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కొడలికి కౌన్సిలింగ్ ఇచ్చి బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు.