Home హైదరాబాద్ చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్

చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్

A woman arrested theft in the beauty parlors

సికింద్రాబాద్: నగరంలో బ్యూటీ పార్లర్‌లలో చోరీలకు పాల్పడుతున్న మహిళను మరేడుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర మండల డిసిపి బి.సుమతి తెలిపిన వివరాల ప్రకారం… కడప జిల్లాకు చెందిన డైసీ అనే మహిళ నగరంలోని పలు ప్రాంతాలలో బ్యూటీ పార్లర్‌లలో దొంగతనాలకు పాల్పడుతున్నది. గడచిన మూడు నెలల్లోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9, సైబరాబాద్ పరిధిలో 5, రాచకొండ పరిధిలో 3 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందన్నారు. మొత్తం 17 దొంగతనాలు చేసినట్టు ఆమె తెలిపారు. చోరీలకు పాల్పడుతున్న ఈ ఘరాన మహిళపై పీడి యాక్టు పెడతామని డిసిపి తెలిపారు. ఆయా పాలీస్ స్టేషన్‌ల పరిధిలో దొంగిలించిన మొత్తం 63 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితురాలు 2009 నుండి ఆయా ప్రాంతాలలో దొంగతనాలు చేస్తు, బ్యూటీ పార్లర్‌లే టార్కెట్‌గా చేసుకొని కస్టమర్‌గా పరిచయం చేసుకొని అదను చూసి బంగారు ఆభరణాలను కాజేస్తున్నదన్నారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మారేడుపల్లి పోలీసులు శనివారం సదరు మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద నుండి 17 లక్షల విలువ చేసే 63 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని నిందితురాలని రిమాండ్‌కు తరలించినట్టు డిసిపి సుమతి తెలిపారు. కేసును చేధించిన మారెడుపల్లి పోలీసులను అబినందించారు.