Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రియుడిని చంపిన ప్రియురాలు

MURDER12కాలిఫోర్నియా : ఓ యువతి ప్రియుడితో గొడవపడింది. అనంతరం అతడిని హత్య చేసింది. ఆమె ఇంతటితో ఆగలేదు. తన ప్రియుడిని తానే హత్య చేశానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలిఫోర్నియాలోని సాన్‌బెర్నాడినో ప్రాంతానికి చెందిన కాసియా అనే యువతి, ఆమె ప్రియుడు డోరియన్(21)లు గొడవపడ్డారు. మద్యం మత్తులో డోరియన్ నకాసియాను కొట్టాడు. దీంతో కాసియా కత్తితో అతడిని పొడించింది. డోరియన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆమె అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం నకాసియా జరిగిన సంఘటనపై తన ఫేస్‌బుక్‌లో హత్యకు దారితీసిన కారణాలను వివరించింది. మద్యం మత్తులో తనను చితకబాదుతుంటే ఏమి చేయాలో తెలియక తన ప్రియుడిపై కత్తితో దాడి చేసినట్టు పేర్కొంది. అయితే అతడు చనిపోతాడని తాను అనుకోలేదని, ఈ ఘటన అనంతరం భయంతో అక్కడి నుంచి పారిపోయినట్టు కాసియా తెలిపింది. పోలీసులు తనను అరెస్టు చేసేలోపు ఈ విషయాన్ని ఇలా పంచుకుంటున్నట్టు వెల్లడింది. డోరియన్ మృతదేహాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నకాసియా కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో ఫేస్‌బుక పోస్టు గురించి తెలిసింది. త్వరలోనే నకాసియాను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Comments

comments